Bihar: తల్లికి మించిన యోధులు లేరు..ఓ సినిమాలోని డైలాగ్. నిజజీవితంలో కూడా తల్లి తన పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. పెంచిపెద్ద చేసి ప్రయోజకులుగా మారుస్తుంది. తన పిల్లలను కాపాడుకునే విషయంలో మృత్యువుకు కూడా అడ్డుగా నిలుస్తుంది. తన ప్రాణాలను పణంగా పెట్టైనా పిల్లల్ని కాపాడుకుంటుంది.
ఈ ఘటనపై ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఘటన బాధాకరమని, కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వం నేరాలను సహించదని, దోషులను కటకటాల వెనకకి పంపుతామని అన్నారు. మరోవైపు బీజేపీ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన సోదరుడి మరణానికి అతని భార్యే కారణమని పగ పెంచుకున్న వ్యక్తి ఆమెకు నిప్పటించి చంపాడు. ఈ ఘటన రత్లాం జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తామామలు, ఆమె బావ మహిళపై పెట్రోల్ పోసి నిప్పటించారు. నిర్మల అనే బాధితురాలు తీవ్రంగా కాలిన గాయాలతో మరణించారు.
Covid-19 Cases: భారతదేశంలో కోవిడ్ మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. వాతావరణ పరిస్థితులు, చలి పెరడగం కూడా వ్యాధి పెరిగేందుకు కారణమవుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు నమోదు అవ్వగా.. ఒకరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 3742 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Drone Attack: రెడ్ సీ(ఎర్ర సముద్రం)లో భారత్‌కి వస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ నౌకపై యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు డ్రోన్ దాడి జరిపారు. ముడి చమురుతో ఉన్న ఈ ట్యాంకర్‌పై డ్రోన్ అటాక్ జరిగినట్లు అమెరికా మిలిటరీ ఈ రోజు వెల్లడించింది. ఎంవీ సాయిబాబా అనే ట్యాంకర్, గబన్ జెండాతో ఉంది. ఈ నౌకలో మొత్తం 25 మంది భారత సిబ్బంది ఉన్నారు. దాడిలో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడి జరిగిన తర్వాత యూఎస్ నౌకకు ఎంవీ సాయిబాబ నుంచి…
DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
WFI: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) కొత్త పాలక వర్గాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. డబ్ల్యూఎఫ్ఐ బాడీ ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను, నియమాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆదివారం ప్రకటించింది. జాతీయ పోటీలకు సంబంధించి చేసిన ప్రకటన తొందరపాటుతో కూడుకున్నదని, సరైన ప్రక్రియను పాటించలేదని క్రీడా మంత్రిత్వ శాఖ అధికార ప్రకటనలో తెలిపింది.
Doctor Punches Patient: ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఓ డాక్టర్ విచక్షణ మరిచి ప్రవర్తించాడు. పేషెంట్ తలపై కొట్టాడు. ఈ ఘటన చైనాలో 2019లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఓ సర్జన్ 82 ఏళ్ల వృద్ధురాలికి సర్జరీ చేస్తూ, ఆమె తలపై మూడుసార్లు కొట్టాడు. ఈ ఘటనపై ప్రస్తుతం చైనా అధికారలుు దర్యాప్తు చేస్తున్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలకు ఇంఛార్జులను కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ ఇంఛార్జ్‌గా ఉన్న ప్రియాంకాగాంధీన వాద్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో యూపీ ఇంఛార్జ్‌గా అవినాష్ పాండేని నియమించింది.
ఖలిస్తానీ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో అమెరికా సూచనల మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిఖిల్ గుప్తా ప్రేగ్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో భారత్‌కి ఎలాంటి అధికార పరిధి లేదని చెక్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ తేల్చి చెప్పింది.