USA: అమెరికాలో మరోసారి ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. హిందూ ఆలయాన్ని టార్గెట్ చేసి దాడి చేశారు. కాలిఫోర్నియాలో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారణయ మందిర గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు. ఆలయ గోడలపై ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు చిత్రీకరించారు.
ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిశోధించాలని ఫౌండేషన్ నెవార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్స్ డివిజన్‌కి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. తీవ్రవాదులు, వేర్పాటువాదులకు అమెరికా చోటు ఇవ్వరాదని పునరుద్ఘాటించారు.
ఈ ఘటనపై భారత కాన్సులేట్, ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసిందని విచారణ జరుగుతోందని జైశంకర్ అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ స్వామినారాయణ్ మంది వాసనా సంస్థపై దాడి చేయాడాన్ని ఖండించింది. త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించాలని కోరింది. అమెరికాలో హిందూ ఆలయాలపై దాడులు జరగడం ఇది కొత్తకాదు. ఇంతకుముందు కూడా ఖలిస్తానీవాదులు ఇలాంటి ఘటనలకే పాల్పడ్డారు. ఒక్క అమెరికాలోనే కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లో దాడులకు పాల్పడుతున్నారు.