Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు.
Ram Mandir Features: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహం ఆలయ గర్భగుడికి చేరుకుంది. ఈ రోజు గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రతిష్ట తర్వాత బాల రాముడు వివిధ పూజలు చేయనున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల నాలుగోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జవవరి 18న తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే మరోసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఇలాగే ఈడీ సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లనున్నారు. రాబోయే…
Ram Mandir: అయోధ్య ‘ప్రాణప్రతిష్ట’ కార్యక్రమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రామ్ లల్లా విగ్రహాన్ని రామ మందిరానికి తీసుకువచ్చారు. క్రేన్ సాయంతో గర్భగుడి వద్దకు చేర్చారు. ఈ రోజు గర్భగుడిలో రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతుండగా.. రాముడి విగ్రహం ఆలయానికి చేరుకుంది.
Andhra woman Arrest: డబ్బులు చెల్లించకుండా 15 రోజులగా ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ మహిళను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు సమీపంలోని ఏరో సిటీలోని ఓ విలాసవంతమైన హోటల్లో గత 15 రోజులుగా ఎలాంటి డబ్బులు చెల్లించకుండా 37 ఏళ్ల మహిళ ఉంటోందని, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Pakistan attacks Iran: పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ ఇరాన్‌పై ప్రతీకార దాడులకు పాల్పడింది. గురువారం రోజు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిజరేషన్ ఆర్మీ వేర్పాటువాద గ్రూపుల పోస్టులపై పాకిస్తాన్ దాడులు చేసినట్లు సమాచారం.
Chandigarh Mayor Polls: బీజేపీ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తొలిపోరుగా భావిస్తున్న చండీగఢ్ మేయర్ ఎలక్షన్ ఈ రోజు జరగబోతోంది. మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నేడు ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గత 8 ఏళ్లుగా బీజేపీ చేతలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, ఆప్ చేతులు కలిపాయి. దీంతో ఈ ఎన్నికల ప్రాధాన్యత సంతరించుకుంది. 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా…
ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 'బియాండ్ బేసిక్స్' సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.
Congress: రామ మందిర వేడుకలపై మరిసారి కాంగ్రెస్, బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. జనవరి 22న రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు రామ మందిర ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయితే ఇది ఆర్ఎస్ఎస్/బీజేపీ కార్యక్రమని, తాము హాజరుకాబోవడం లేదని ఇప్పటికే కాంగ్రెస్ స్పష్టం చేసింది.
Lufthansa Airlines: తెలుగు రాష్ట్రాల నుంచి జర్మనీ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కి డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించింది. జనవరి 17 నుంచి ఈ ఫ్లైట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌ని ప్రపంచానికి అనుసంధానం చేయడం, వాణిజ్యం కోసం గ్లోబల్ హబ్‌గా మార్చడానికి ఇది సహకరిస్తుందని GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ ప్రకటనలో తెలిపింది.