Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవులు ఉండేందుకు ఏకైక ప్రదేశంగా అంగారకుడు చెప్పబడుతున్నాడు. ఒకప్పుడు నదులు, సముద్రాలతో విలసిల్లిన గ్రహం ప్రస్తుతం బంజెరు భూమిగా మారింది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఆ గ్రహం నిస్సారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడ జీవులకు సంబంధించిన వివరాలను, గతంలో ఎలా ఉండేదో అనే ఉత్సుకత ఇప్పటికీ పరిశోధకుల్లో ఉంది. అందుకే మార్స్ గ్రహానికి అనేక రోవర్లు, ల్యాండర్లను వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు పంపాయి.
Ayodhya: అయోధ్యతో జనవరి 22న భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మరోవైపు దేశంలోని పలు రంగాలకు చెందిన ముఖ్యులతో సహా సాధువులు 7000 పైగా అతిథులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలతో పాటు అన్ని సెక్యూరిటీ ఏజెన్సీలు, యూపీ పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Ayodhya Ram Temple: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులు, రామ భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, 7000 మందికి పైగా అతిథులు, లక్షల మంది ప్రజల మధ్య రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోంది. ఈ మేరకు యూపీ సర్కార్‌తో పాటు సెంట్రల్ భద్రతా ఏజెన్సీలు అన్నీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి.
Rashmika Mandanna: నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా వివాదం సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.
Ayodhya: హనుమంతుడి జన్మస్థలం కర్ణాటక హంపీ ప్రాంతాంలో ఉన్న కిష్కింధ నుంచి శ్రీరాముడి కోసం ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందే అయోధ్యకు చేరింది. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల మీదుగా రథం అయోధ్యకు చేరుకునే ముందు సీతా దేవీ జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ వెళ్లింది. 100 మంది భక్తుల బృందం "జై శ్రీ రామ్" నినాదాలు చేస్తూ రథం వెంట నడిచారు. మూడేళ్ల క్రితం ఈ యాత్ర ప్రారంభమైంది.
Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్ "మిస్ వరల్డ్" పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీకలు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ‘‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. #మిస్ వరల్డ్ ఇండియా #బ్యూటీ విత్ పర్పస్’’ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో మిస్ వరల్డ్ చైర్మన్ జూలియా మోర్లీని…
Ayutthaya: హైందవం ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇప్పడు ఇస్లామిక్ దేశాలుగా చెప్పబడుతున్న పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియాతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా హిందూ మతానికి చెందిన ఆనవాళ్లు లభిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇండోనేషియాలో ఇస్లాం మతస్తులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా మంది హిందూ ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ఇండోనేషియా ఎయిర్‌లైన్స్ పేరు ‘గరుడ’ అని పెట్టుకున్నారంటే, వారు ఎంతగా ఈ హిందూ జీవనశైలితో మమేకమయ్యారో తెలుసుకోవచ్చు.
Hyderabad airport: హైదరాబాద ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, బోయింగ్, ఎయిర్ బస్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ దేశంలోనే నాలుగో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతోంది. ఫార్మా, ఐటీ, టెక్నాలజీలకు కేంద్రంగా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి హైదరాబాద్‌కి నేరుగా ఫ్లైట్స్ నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు విదేశాల నుంచి నగరానికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్‌లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
Ayodhya Event: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని 7000 మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ సర్కార్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది.