World War-3: మూడో ప్రపంచ యుద్ధాన్ని రష్యానే ప్రారంభించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి వెలువడిన రహస్య పత్రాలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని బిల్డ్ వార్తా పత్రికలో ప్రచురితమైంది. జర్మనీ రష్యాకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సిద్ధమవుతోందని, వచ్చే ఏడాది నాటో మిత్రదేశాలపై దాడి చేయడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించగలదని, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తాపత్రిక పేర్కొంది.
Vivek Ramaswamy: అయోవా స్టేట్ ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేస్తు్న ట్రంప్‌కి మొదటి విజయం దక్కింది. మరోవైపు ఇదే పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో రిపబ్లికన్ అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు రామస్వామి తెలిపారు.
Namibian cheetah: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో మరో చిరుత మరణించింది. 2022 సెప్టెంబర్ నెలలో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతల్లో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శౌర్య అని పిలువబడే చిరుత మరణించడంతో ఇప్పటి వరకు 7 పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు మరణించాయి. మార్చి 2023లో 3 చిరుత పులి పిల్లలు మరణించాయి.
Dead Rat In Food: ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్‌కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచి క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ ఆర్డర్ చేశాడు.
Virat Kohli: స్టార్ క్రికెటర్, కింగ్ విరాట్ కోహ్లీకి రామ మందిర ఆహ్వానం అందింది. కోహ్లీ, అనుష్క దంపతులను జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానం అందించింది. అంతకుముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఆహ్వానం అందింది. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, రణబీర్ కపూర్ వంటి ప్రముఖులకు కూడా రామ మందిర ట్రస్టు ఆహ్వానాలను అందించింది.
Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్‌పై విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ‘‘ఆర్ఎస్ఎస్కి చోటా రీఛార్జ్’’ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఢిల్లీలో సుందరాకాండ పారాయణం చేయాలని ఆప్ నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ఓవైసీ విమర్శించారు.
Honeymoon: రెండు రోజులుగా పొగమంచు, వాతావరణ పరిస్థితులు విమానయాన కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో వందలాది మంది ప్రయాణికులతో నిండిపోయి, యుద్ధ వాతావరణం కనిపించింది. ఫ్లైట్స్ ఎప్పుడు బయలుదేరుతాయో తెలియక చాలా మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని విమానాల్లోకి ఎక్కిన ప్రయాణికులు గంటల తరబడి అందులో ఉండాల్సి వచ్చింది.
Singer KS Chithra: దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి, దేశవ్యాప్తంగా 7000 మంది ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. లక్షలాది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నాయి. అయోధ్యలో పూర్తిగా పండగ వాతావరణం ఏర్పడింది. యోగి సర్కార్ అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
Chandigarh mayoral polls: చండీగఢ్ మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఇండియా కూటమికి అగ్ని పరీక్ష కాబోతోంది. చండీగఢ్‌లో మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు గురువారం (జనవరి 18) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఇండియా కూటమి, బీజేపీ పార్టీకి మధ్య ముఖాముఖి పోరుగా ఉండబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇండియా కూటమిలో సభ్యుడిగా ఉన్న ఆప్, బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇండియా కూటమి నేరుగా బీజేపీకి…
Tata Punch.ev: టాటా ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూసుకుపోతోంది. ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్ లీడర్‌గా టాటా ఉంది. ఇప్పటికే టాటా నుంచి టియాగో, టిగోర్, నెక్సాన్ ఈవీలు రాగా.. ఇప్పుడు టాటా పంచ్ ఈవీని తీసుకువస్తోంది. ఈ కార్‌పై జనాల్లో చాలా ఆసక్తి ఉంది. పంచ్ ఈవీ పూర్తిగా ఈవీ ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది టాటా. జనవరి 17న Tata Punch.ev లాంచ్ కాబోతోంది.