Khalistan: ఖలిస్తానీ అనుకూలవాదులు విదేశాల్లోనే కాదు, దేశంలో కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హిందువుల దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనిపై ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం దర్యాప్తు చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ దేశానికి మద్దతుగా ఉన్న ఈ గ్రాఫిటీలను ఆ తర్వాత తొలగించారు.
World's Richest Family: 700 కార్లు, రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్, 8 జెట్ విమానాలు ఇదిల ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం సొంతం. ఈ కుటుంబం మరేదో కాడు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్(ఎంబీజెడ్) ఈ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. దుబాయ్‌లోని ఎంబీజెడ్ కుటుంబం రూ. 4087 కోట్ల విలువైన భవనం కలిగి ఉంది. ఇది మూడు పెంటగాన్ల పరిమాణంలో ఉంటుంది.
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.
Gurmeet Ram Rahim Singh: అత్యాచారం, హత్య దోషి డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరాబాబా)కి మరోసారి పెరోల్ మంజూరైంది. తాజాగా 50 రోజలు పాటు పెరోల్ లభించింది. గత నాలుగేళ్లలో ఆయనకు పెరోల్ రావడం ఇది 9వ సారి. అని పెరోల్ పొడగింపుకు హర్యానా సర్కార్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆయన రోహ్తక్లోని సునారియ జైలులో ఉన్నాడు. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబర్‌లో…
Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
Heart Attack: ఇటీవల కాలంలో యువకులతో పాటు టీనేజ్‌లో ఉన్న యువకులు కూడా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ, జిమ్‌లో వ్యాయామం చేస్తూ యువకులు మరణించిన సంఘటనలు చూశాం. ఇలాంటి విషాదకరమైన ఘటనే మధ్యప్రదేశ్ ఇండోర్‌లో చోటు చేసుకుంది. సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లో క్లాస్ వింటూనే గుండెపోటుతో కూలిపోయాడు ఓ విద్యార్థి.
BJP: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సం జరిగే రోజే సర్వమత ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై బీజేపీ ఫైర్ అవుతోంది. ముఖ్యమంత్రి ‘సంప్రీతి యాత్ర’ గురించి బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి వెళ్లడం లేదు, ఇక్కడ ఊరేగింపు చేస్తు్న్నారు, ఆమె ఎవరిని కలుపుతోంది..? బెంగాల్లో రక్తపాతం జరుగుతోందని, ఆమెను రాముడు కూడా క్షమించడని మండిపడ్డారు.
Ram Temple Event: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు యావత్ దేశం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం జరగబోతోంది.
Anti-biotics: యాంటీ బయాటిక్స్ అధిక వాడకాన్ని నిరోధించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. రోగులకు యాంటీ బయాటిక్స్ సూచించేటప్పుడు వైద్యులు తప్పనిసరిగా కారణాన్ని పేర్కొనాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ యాంటి బయాటిక్స్ అధికంగా వాడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దీన్ని ముందడుగుగా భావిస్తోంది. కారణంతో పాటు తప్పనిసరిగా సూచనలు తెలియజేయాలని వైద్యుల్ని కోరింది.
Ayodhya Ram Mandir: అయోధ్య భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు దీని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడి (5 ఏళ్ల రాముడి రూపం) సూచించే విగ్రహం ఉంటుంది.