Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జవవరి 18న తమ ముందు హాజరుకావాలని కోరింది. అయితే మరోసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఇలాగే ఈడీ సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ విద్యాశాఖ కార్యక్రమంలో పాల్గొన్న వెంటనే కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి గోవాకి మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లనున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా గోవాలో ఆప్ తన కార్యాచరణ రూపొందిస్తోంది.
Read Also: Ram Mandir: అయోధ్య బాల రాముడికి నేడు పూజలు.. గర్భగుడికి చేరుకున్న విగ్రహం..
అంతకుముందు జనవరి 3న ఈడీ విచారణకు కాలేదు. తనను అరెస్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని, ఈడీ సమన్లు చట్టవిరుద్దమైన, రాజకీయ ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ ఆరోపించారు. నేను నా జీవితంలో నిజాయితీగా, పారదర్శకంగా ఉన్నానని అన్నారు. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న ఈడీ ముందు హాజరవ్వడానికి నిరాకరించారు. ఈ కేసులో ఇప్పటికే ఆప్ కీలక నేతలు సత్యేంద్ర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ విచారణకు పిలిచి, కస్టడీలోకి తీసుకుంది. కేజ్రీవాల్‌ని కూడా ఇలాగే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.