ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 ‘బియాండ్ బేసిక్స్’ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.
Read Also: RBI Governor : ప్రపంచానికి భారత్ పై పెరిగిన విశ్వాసం.. వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని అంచనా
26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 34,745 మంది పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒక గ్రామీణ జిల్లాలో సర్వే చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం రెండు జిల్లాల చొప్పున సర్వే చేశారు. ప్రథమ్ ఫౌండేషన్ ప్రచురించిన వార్షిక నివేదికలో 14-18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థుల్లో సగం మంది మ్యాథమెటిక్స్ డివిజన్ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నారు. 25 శాతం మంది తమ మాతృభాషలో క్లాస్ 2 స్థాయి పాఠ్యాంశాలనను స్పష్టంగా చదవలేకపోతున్నారు. డివిజన్ ప్రాబ్లమ్స్( 3 అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం) చేయడానికి కష్టపడుతున్నారు. నిజానికి 3-4 తరగతుల స్థాయి పిల్లలు ఇలాంటి లెక్కల్ని చేయాలి.
ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే 57.3 శాతం విద్యార్థులు ఇంగ్లీష్ చదవగలుగుతున్నప్పటికీ.. దీనిలో మూడో వంతు పిల్లలు మాత్రమే వాటి అర్థాలను చెప్పగలుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో క్లాస్-2 లెవల్ వ్యాఖ్యాలను చదవడంలో మగ పిల్లలతో(70.9) పోలిస్తే, ఆడ పిల్లలు(76 శాతం) మెరుగ్గా ఉన్నారు. ఇక అంకగణితం, ఇంగ్లీష్‌లో బాలికల కన్నా బాలురు మెరుగ్గా ఉన్నారు.