OPPO Reno 15c: ఒప్పో (OPPO) సంస్థ కొత్తగా Reno15 సిరీస్‌లో భాగంగా OPPO Reno 15c స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ప్రీమియం డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ స్పెసిఫికేషన్లు అందిస్తున్న ఈ ఫోన్, ధర పరంగా కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది. భారీ ఫీచర్లు ఉన్నప్పటికీ మీడియం ధర శ్రేణిలోనే తీసుకురావడం మంచి విషయమే అని చెప్పాలి.
AI showdown: AI సామ్రాజ్యంలో సింహాసనం ఎవరిది.? ChatGptకి గట్టి పోటీ ఇస్తున్న Gemini..!
ఈ కొత్త మొబైల్ లో 6.57 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉండటంతో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. ఫోన్‌కు ఆకర్షణీయమైన ‘డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్’ అందించారు. అంతేకాదు, IP66, IP68, IP69 రేటింగ్‌లు ఉండటం వల్ల దుమ్ము, నీటికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో Snapdragon 6 Gen 1 (4nm) ప్రాసెసర్ ను ఉపయోగించారు. 8GB / 12GB RAM ఆప్షన్లతో పాటు 256GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ డివైస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16పై పనిచేస్తుంది.
అలాగే ఇందులో కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం మరో ప్లస్ పాయింట్. ఈ ఫోన్‌లోని ప్రధాన హైలైట్ 7000mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. కనెక్టివిటీ పరంగా 5G, Wi-Fi, Bluetooth 5.4, USB Type-C వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.
YS Jagan on AP Capital: రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..!
ధరల విషయానికి వస్తే OPPO Reno 15c 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999 కాగా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫ్టర్ గ్లో పింక్, ట్వైలైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఫిబ్రవరి నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.