PM Modi: రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ యువరాజును స్టార్-అప్‌గా ప్రజెంట్ చేసిందని, కానీ నాన్ స్టార్టప్ అని తేలిందని’’ అన్నారు. కాంగ్రెస్ ఎంత ప్రయత్నించిన అతడిని లాంచ్ చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: PM Modi: నెహ్రూ రిజర్వేషన్లను వ్యతిరేకించారు, కాంగ్రెస్‌ది బానిస మనస్తత్వం..
నేను స్వతంత్ర దేశంలో పుట్టానని, నా ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయని ప్రధాని మోడీ అన్నారు. తాను బానిసత్వానికి వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నాశనం చేస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీఎస్ఎన్ఎల్ నాశనం చేసింది ఎవరు.. హెఏఎల్, ఎయిర్ ఇండియాను దెబ్బతీసింది ఎవరని ప్రశ్నించారు. ప్రస్తుతం హెచ్ఏఎల్ రికార్డ స్థాయి లాభాలను సాధిస్తుందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎల్ఐసీ ఎక్కడుంది.. ఇప్పుడు ఎల్ఐసీ షేర్ రికార్డు స్థాయిని అందుకుందని ప్రధాని అన్నారు. 2014లో 234 పీఎస్‌యూలు ఉంటే నేడు అవి 254కి చేరాయని ప్రధాని చెప్పారు. పదేళ్లలో పీఎస్‌యూల విలువ రూ.9.5 లక్షల కోట్ల నుంచి రూ. 17 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని వెల్లడించారు.