Donald Trump: ట్రంప్‌కి యూఎస్ కోర్ట్ షాక్.. విచారణ నుంచి మినహాయింపు లేదని తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మళ్లీ అమెరికా ప్రెసిడెంట్ కావాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కి అక్కడి కోర్టులు వరస షాక్‌లు ఇస్తున్నాయి. తాజాగా కొలంబియా డిస్ట్రిక్ట్ యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ కీలక తీర్పును వెలువరించింది. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించాడనే ఆరోపణపై అతనికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని, ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేదని మంగళవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ నేర విచారణకు మరింత దగ్గరయ్యాడు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత ట్రంప్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు కుట్ర చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రస్తుత తీర్పు వచ్చింది.
Read Also: Ayodhya: ఏప్రిల్‌లో మసీదు నిర్మాణానికి శ్రీకారం.. మక్కా నుంచి ఏం తెస్తున్నారంటే..!
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
అధ్యక్షుడిగా తన అధికారిక బాధ్యతలకు సంబంధించి కోర్టులు ప్రాసిక్యూట్ చేయలేవని ట్రంప్ చేసిన వాదనల్ని ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ తిరస్కరించింది. అతను అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో అతని రక్షణ కల్పించిన ఏదైనా కార్యనిర్వాహక ఇమ్యూనిటీ పవర్ ఈ విచారణ నుంచి అతడిని రక్షించదని కోర్టు పేర్కొంది. యూఎస్ సుప్రీంకోర్టుకి అప్పీల్ కోసం వెళ్లడానికి ట్రంప్‌కి ఈ నెల 12 వరకు సమయం ఉంది.
మరోవైపు, ట్రంప్ లాయర్లు వాదిస్తూ.. మాజీ అధ్యక్షుడు చట్టపరమైన రక్షణలను పొందేందుకు అర్హులని, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ చేత అభిశంసించబడి, సెనేట్ చేత పదవి నుండి తొలగించబడితే తప్ప అధికారిక చర్యల కోసం క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయబడడని వాదించారు. ఇప్పటికే ట్రంప్ నాలుగు క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించాడనేది ఇందులో ఒకటి. అయితే, నాలుగు కేసుల్లో తాను నిర్దోషినని ట్రంప్ చెబుతున్నాడు, రాజకీయంగా తన ప్రచారాన్ని దెబ్బతీయడానికి ప్రేరేపించిన ప్రయత్నంగా ఆరోపించాడు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!