Venu Goapl Reddy
Author- NTV Telugu-
CBI’s Operation Meghchakra: పిల్లల లైంగిక దోపిడి కేసుపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు
CBI raids in child pornography case: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) దేశవ్యాప్తంగా భారీగా దాడులు చేసింది. పిల్లల లైంగిక దోపిడికి సంబంధించిన కేసులో 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 56 ప్రదేశాలపై దాడులు చేశారు. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియర్ ను సర్య్కులేట్ చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. న్యూజిలాంట్ లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. -
Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
China: అవినీతిపై జిన్ పింగ్ ఉక్కుపాదం.. మాజీ మంత్రులకు ఉరిశిక్ష
Death penalty for former ministers in China: అవినీతికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా వదిలిపెట్టేలా లేదు చైనా. తాజాగా రెండు రోజుల వ్యవధిలో అవినీతికి పాల్పడిని ఇద్దరు మాజీ మంత్రులకు ఉరిశిక్ష విధించారు. అవినీతి అధికారులు, రాజకీయ నాయకులపై జిన్ పింగ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికాను మించి సూపర్ పవర్ గా ఎదగాలని భావిస్తున్న జిన్ పింగ్.. 2012 నుంచి అధికారం చేపట్టిన తర్వాత నుంచి అవినీతిని సహించడం లేదు. ఇప్పటికే రెండు పర్యాయాలు చైనా అధ్యక్షుడిగా పనిచేసిన జిన్ పింగ్… -
PFI: పీఎఫ్ఐ బ్యాన్ చేయాలని పెరుగుతున్న డిమాండ్లు..
Demands to ban PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు, మనీలాండరింగ్ కు పాల్పడుతుందని ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్ఐఏ), ఈడీలు సంయుక్తంగా 15 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపాయి. 100కు పైగా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ‘ ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్న పీఎఫ్ఐని నిషేధించాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. -
Anti-Hijab Protests In Iran: అట్టుడుకుతున్న ఇరాన్.. ప్రభుత్వ కాల్పుల్లో 50 మంది మృతి
Anti-Hijab Protests In Iran: హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని గత వారం మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఆమె కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతి దేశవ్యాప్తంగా మహిళలు, యువతలో కోపాన్ని రగిల్చింది. దీంతో రాజధాని టెహ్రాన్ తో పాటు అన్ని ప్రావిన్సుల్లో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు హిజాబ్ ను వ్యతిరేకిస్తూ.. హిజాబ్ ను తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని ఆందోళనలు… -
Tamilnadu: హల్క్ స్వామి వర్సెస్ చెన్నై స్వామి.. సంచలనంగా మారిన స్వామిజీల గొడవ
Swamiji's fight: ప్రజలకు సద్భుద్ధులు చెప్పాల్సిన స్వామీజీలే కొట్టుకున్నారు. నువ్వు గొప్ప అంటే లేదు నేనే గొప్ప అంటూ ఇద్దరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో సంచలనంగా మారింది. ఇద్దరు స్వామీలు కొట్టుకున్న వీడియో తమిళనాడులో వైరల్ గా మారింది. వీరిద్దరి గొడవ సింగపూర్ లో జరిగింది. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామీజీ రోగాలు నయం చేయడంలో ఫేమస్. -
Anti-Hijab protests: ఇరాన్లో ప్రభుత్వానికి, హిజాబ్‌కు మద్దతుగా ర్యాలీలు
Anti-Hijab protests In Iran- Mahsa amini Death: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి హిజాబ్ ధరించలేదని ఇరాన్ లోని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి మరణించింది. దీంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ కు వ్యతిరేకంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. మహిళలు హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలను ఇరాన్ ప్రభుత్వం క్రూరంగా అణిచివేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం చేసిన దాడుల్లో 30కి పైగా మంది మరణించారు. -
India: భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగంగా ఉంది, ఉంటుంది.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్
India is a strong counter to Pakistan on Jammu and Kashmir: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భారత్ తరుపున యూఏన్ లో మాట్లాడిన మొదటి కార్యదర్శి మిజితో వినిటో పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. కాశ్మీర్ సమస్యపై షెహబాజ్ చేసిన వ్యాక్యలన్నీ అబద్ధాలని భారత్ తిప్పికొట్టిది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంలో మునిగిపోయిందని భారత్ విమర్శించింది. ఇండియాపై ఆరోపణలు చేయడానికి ఈ అత్యున్నత వేదికను పాకిస్తాన్ ఎంచుకోవడం బాధాకరమని.. పాక్… -
Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్
Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు… -
Uttarakhand Girl Assassination Case: యువతి హత్యపై సీఎం సీరియస్.. బీజేపీ నేత కుమారుడి రిసార్ట్ కూల్చివేత
Uttarakhand Girl Assassination Case: ఉత్తరాఖండ్ లో అంకితా బండారీ అనే 19 ఏళ్ల యువతి హత్య ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనక బీజేపీనేత కుమారుడి హస్తం ఉండటంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు
తాజావార్తలు
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!