PM Modi: రాజ్యసభ వేదికగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. దళితులు, వెనకబడినవారికి, గిరిజనులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకమని, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకమని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఆరోపించారు. ఓబీసీలకు ఎప్పుడూ పూర్తి రిజర్వేషన్లు ఇవ్వని కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని బోధించకూడదని అన్నారు. అంబేద్కర్ భారతరత్నకు అర్హడని కాంగ్రెస్ ఎప్పుడూ భావించలేదని ఆయన అన్నారు. నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖను ప్రస్తావించారు. ‘‘నాకు రిజర్వేషన్లు, ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇష్టం లేదు, అసమర్థతను ప్రోత్సహించే ఏ చర్యకైనా నేను వ్యతిరేఖం’’ అని ఆయన రాసిన లేఖను గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mouli Talks: ఏపీ క్యాపిటల్ పై జోక్.. తల్లితండ్రులను లాగొద్దు ప్లీజ్ అంటూ #90స్ మౌళి ట్వీట్
అధికారంలో ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని, 10 ఏళ్లలో మేము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చామని, కానీ ఆర్థిక వ్యవస్థ గురించి కాంగ్రెస్ బోధించాలని అనుకుంటోందని చురకలు అంటించారు. కాంగ్రెస్ తన ప్రయోజనాల కోసం వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని, సైన్యాన్ని ఆదునీకరించేందుకు అనుమతించని కాంగ్రెస్, ఇప్పుడు భద్రతపై ఉపన్యాసం ఇస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సురేష్ దక్షణ భారతదేశాన్ని ప్రత్యేకదేశంగా గుర్తించాలనే వ్యాఖ్యాలను ఉద్దేశిస్తూ.. ఉత్తర-దక్షిణ విభజన సృష్టించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని చంపిందని, ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసి, దేశాన్ని విభజించాలని అనుకుందని ఆరోపించారు.
బ్రిటీష్ వారి నుంచి కాంగ్రెస్ ప్రేరణ పొందిందని, కాంగ్రెస్‌ని పుట్టించిందే ఓ బ్రిటీషర్ అని, కాంగ్రెస్‌ది బానిస మనస్తత్వమని, ఇది భారతదేశాన్ని అణివేసేలా ప్రోత్సహించిందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ గతంలో బ్రిటన్ సమయంలో సమానంగా ఉండేందుకు సాయంత్రం బడ్జెట్ ప్రవేశపెట్టేవారని చెప్పారు. ఏడు దశాబ్ధాలుగా జమ్మూ కాశ్మీర్ లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు హక్కులు కల్పించలేదని, ఆర్టికల్ 370ని రద్దు చేయలేదని, ప్రస్తుతం వారికి హక్కులు లభించాయని మోడీ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్డీయే ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిందని ప్రధాని సభలో అన్నారు.