Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్…
Madhya Pradesh HC: ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇంటిని స్థానిక పరిపాలన అధికారులు తప్పుగా కూల్చేశారు. ఈ కేసును మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ విచారించి, సదరు మహిళకు రూ. 1 లక్షని పరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక సంస్థలకు ఇప్పుడు "ఫ్యాషన్"గా మారిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Best CMs: దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం…
INDIA bloc: ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ముందే ఈ కూటమి ఉంటుందా.? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి, మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో జతకట్టాడు. ఇది ఇండియా కూటమిని…
AIIMS: భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు కీలక ఆపరేషన్ నిర్వహించి 9 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. ఉపిరితిత్తుల్లో ‘‘కుట్టు సూది’’ని తొలగించి అతడిని కాపాడినట్లు శుక్రవారం ఎయిమ్స్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ విభాగం ఎలాంటి ఓపెన్ సర్జరీ చేయకుండా బ్రొంకోస్కోపిక్ ద్వారా కుట్టు సూదిని తొలగించినట్లు, ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు.
Yogi Adityanath: జ్ఞానవాపి మసీదు వివాదం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వారణాసి కోర్టు జ్ఞానవాపి సెల్లార్లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై పలువురు ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి వార్నింగ్ ఇస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా..? అని ప్రశ్నించారు. దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో రామ మందిర నిర్మాణం, జనవరి 22 ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని…
Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Supriya Sule: ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్ పే, ఫోన్‌పే యాప్‌లు పేలబోయే టైమ్ బాంబులు ‘‘టిక్కింగ్ టైమ్ బాంబ్స్’’గా శుక్రవారం ఆరోపించారు. మనీలాండరింగ్ తనిఖీలు చేయడానికి కేంద్రం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘భారత ఆర్థిక వ్యవస్థ శ్వేతపత్రం’’పై జరిగిన చర్చ సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.