AIIMS: భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు కీలక ఆపరేషన్ నిర్వహించి 9 ఏళ్ల బాలుడి ప్రాణాలను కాపాడారు. ఉపిరితిత్తుల్లో ‘‘కుట్టు సూది’’ని తొలగించి అతడిని కాపాడినట్లు శుక్రవారం ఎయిమ్స్ అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆస్పత్రిలోని పీడియాట్రిక్ విభాగం ఎలాంటి ఓపెన్ సర్జరీ చేయకుండా బ్రొంకోస్కోపిక్ ద్వారా కుట్టు సూదిని తొలగించినట్లు, ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని చెప్పారు.
Read Also: Yogi Adityanath: “సీఎం యోగి బెంగాల్ వస్తే”.. టీఎంసీ నేత హెచ్చరిక..
పశ్చిమ బెంగాల్‌కి చెందిన తొమ్మిదేళ్ల బాలుడి ఉపరితిత్తుల దిగువన లోబ్ బ్రోంకస్ లాట్రల్ భాగంలో సుమారు 4 సెంటీమీటర్ల పొడవు కలిగిన కుట్టు సూదిని వైద్యులు తొలగించారు. డాక్టర్ రష్మీ రంజన్ దాస్, డాక్టర్ కృష్ణ ఎం గుల్లా, డాక్టర్ కేతన్, డాక్టర్ రామకృష్ణ నేతృత్వంలోని శిశువైద్యుల నిపుణుల బృందం సూదిని తీయడానికి బ్రోంకోస్కోపిక్ ద్వారా సూదీని బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపారు.