HONOR Magic8 Pro Air: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ (HONOR) మరో స్టైలిష్ ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేయడానికి సిద్ధమైంది. గతేడాది Magic8 సిరీస్ ను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ (HONOR Magic8 Pro Air)ను జనవరి 19న చైనాలో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్‌తో ఈ ఫోన్ కొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Jana Nayagan: ‘జన నాయగన్’కు హైకోర్టు షాక్.. జనవరి 21 వరకు నో రిలీజ్..!
హానర్ ప్రకారం రాబోయే Magic8 Pro Air ఫోన్ లైట్‌వెయిట్ అయినప్పటికీ పవర్‌ఫుల్ పనితీరు అందించేలా డిజైన్ చేశారన్నారు. హానర్ తన ఫామ్‌ను కొనసాగిస్తోంది..కొత్త అనుభూతిని కొత్తగా ఆవిష్కరిస్తుంది అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది కంపెనీ. ప్రీ-ఆర్డర్ పేజ్ ప్రకారం ఈ ఫోన్ బ్లాక్, వైట్, పర్పుల్, ఆరెంజ్ మొత్తం నాలుగు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఇక స్టోరేజ్ విషయంలో 256GB, 512GB, 1TB అనే మూడు వేరియంట్లు ఉండనున్నాయి. ఇంతకు ముందు విడుదలైన టీజర్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, కెమెరా మాడ్యూల్ కింద LED ఫ్లాష్, మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్ స్పష్టంగా కనిపించాయి. అలాగే లీక్‌లు, కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ కేవలం 6.3mm మందం మాత్రమే ఉండనుంది. అంతేకాదు ఫోన్ బరువు కేవలం 158 గ్రాములు మాత్రమే కావడంతో ఇది అల్ట్రా లైట్ బాడీ ఫోన్‌గా నిలవనుంది.
Yash KGF Chapter 3 Update: KGF 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పిన రాకీ భాయ్..
ఈ ఫోన్‌లో 1/1.3-ఇంచ్ ప్రో-లెవల్ లార్జ్ సెన్సార్ మెయిన్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టే యూజర్లకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. ఇప్పటివరకు డిజైన్, బేసిక్ స్పెసిఫికేషన్లపై మాత్రమే క్లారిటీ వచ్చింది. ఫుల్ స్పెసిఫికేషన్స్, ధర వివరాలు, గ్లోబల్ లాంచ్ సమాచారం కోసం జనవరి 19 వరకు వేచి చూడాల్సిందే.