Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సంకీర్ణం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ “పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)”, బిలావల్ భుట్లోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పార్టీలు ఎక్కువగా సీట్లనను గెలుచుకున్నాయి.
Read Also: CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లుగా ఆ దేశ మీడియా వెల్లడించింది. ఎవరు ఏ పదవిని చేపడుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. తామే ఎన్నికల్లో గెలిచామని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కూడా తనదే విజయమని చెబుతున్నారు.
పాకిస్తాన్‌లో గురువారం 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీకి 71 స్థానాలు, భుట్టో పార్టీకి 53 స్థానాలను గెలుచుకుంది. మరో 15 నేషనల్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక శనివారం ఉదయం వరకు వెలువడిన ఫలితాల్లో 99 స్థానాలను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఇందులో 88 మంది ఇమ్రాన్ ఖాన్‌కి విధేయులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 133 సీట్లు కావాలి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పాకిస్తాన్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!