Venu Goapl Reddy
Author- NTV Telugu-
PM Sheikh Hasina: రోహింగ్యాల వల్ల బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంపై తీవ్ర ప్రభావం
PM Sheikh Hasina on Rohingya issue: రోహింగ్యాలను స్వేదేశానికి వెళ్లేలా సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలను కోరారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. రోహింగ్యాల సమస్య ఈ ప్రాంతంలో స్థిరత్వం, భద్రతపై ప్రభావం చూపిస్తోందని శనివారం ఆమె యూఎన్ లో అన్నారు. మయన్మార్ లో కొనసాగుతున్న రాజకీయ హింస, సాయుధపోరాటాలు రోహింగ్యాలను స్వదేశానికి తరలించడాన్ని క్లిష్టతరం చేసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో యూఎన్ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.2 తీవ్రతతో కంపించిన భూమి
Earthquake hits Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం వచ్చింది. వరసగా రెండో రోజు కూడా భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం ఉత్తరాన అచే ప్రావిన్స్ లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణా నష్టాలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ఇచ్చిన భూకంపంతో ప్రజలు ఇళ్ల నుంచి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారు. సునామీ వార్తల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
Kerala Lottery winner is in Trouble: కేరళ లాటరీ విజేతకు కొత్త కష్టాలు
Kerala Lottery winner is in Trouble: కేరళలో ప్రభుత్వం మెగా ఓనం లాటరీలో రూ. 25 కోట్లు గెలిచారు ఓ ఆటో డ్రైవర్. ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ లాటరీలో ఇన్ని కోట్లు గెలవడం ప్రజల్ని ఆకర్షించింది. అయితే ఇప్పుడు లాటరీ విన్నర్ అనూప్ బాధపడుతున్నారు. నేను ఎందుకు లాటరీని గెలిచానని.. గెలవకుంటే బాగుండేదని భావిస్తున్నారు. నేను మనశ్శాంతిని కోల్పోయాను..ప్రస్తుతం నేను నా సొంత ఇంటిలో కూడా నివసించలేకపోతున్నానని ఆయన అంటున్నారు. నేను లాటరీ గెలిచినప్పటి… -
Venkaiah Naidu: సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ పేరుతో పుస్తకం విడుదల
sabka saath sabka vikas sabka vishwas book release: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రసంగాలను సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముస్లిం… -
Saudi Arabia: సౌదీలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాలు
Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper Deposits: పెట్రోలియమే కాదు.. ఇకపై బంగారంలోనూ సౌదీ అరేబియా తన మార్కును చాటుకోనుంది. పవిత్ర నగరమైన మదీనాలో బంగారం, రాగి ఖనిజాలకు సంబంధించి భారీ బంగారు నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ - రహా సరిహద్దుల్లో బంగార నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా, అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో రాగి నిక్షేపాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. -
Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
PM Modi can bring peace between Russia and Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు మెక్సికో విదేశాంగ మంత్రి మార్సెలో లూయిస్ ఎబ్రార్డ్ కాసౌబోన్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా,ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. -
Sikh Referendum: సిక్కు వేర్పాటువాదులతో పాకిస్తాన్ సమావేశం..
Pakistani diplomat meeting with Sikh separatists: పాకిస్తాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారతదేశాన్ని ఇరుకున పెట్టే ప్రతీ విషయంలో భాగమవుతోంది. కెనడా కేంద్రంగా సిక్కు వేర్పాటువాదులు సిక్క రిఫరెండం ఏర్పాటు చేసిన రోజునే.. పాకిస్తాన్ అధికారులు పలువురు వేర్పాటువాద నేతలతో రహస్య సమావేశాలు నిర్వహించారు. కెనడాలోని కాన్సుల్ జనరల్ జన్బాజ్ ఖాన్ వాంకోవర్ నగరంలోని సర్రేలోని రెండు ఖలిస్తానీ అనుకూల గురుద్వారాలను సందర్శించారు. పాకిస్తాన్ వరద సహాయం కోసం విరాళాలు పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే పాక్ అసలు ఎజెండా మాత్రం… -
CM Ashok Gehlot: గాంధీ కుటుంబం పోటీలో ఉండదు.. నేను మాత్రం పోటీ చేస్తున్నాను
congress president elections: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం లేదని శుక్రవారం ఆయన తెలిపారు. నేను పోటీ చేయాలనుకుంటున్నానని.. త్వరలోనే నామినేషన్ దాఖలు చేస్తానని అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. -
Anti-Hijab Protest In Iran: అధికారులు కొట్టడంతోనే నా కూతురు చనిపోయింది: మహ్సా అమిని తండ్రి
Anti-Hijab Protest In Iran: మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతి మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ దేశాన్ని కుదిపేస్తుంది. హిజాబ్ ధరించలేదని చెబుతూ.. మహ్సా అమినిని మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె కోమాలోకి వెళ్లి చనిపోయింది. ఈ మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున బయటకు వచ్చి ప్రభుత్వానికి, ఇరాన్ సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హిజాబ్ ను విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని మహిళలు పెద్ద… -
Kerala Bandh: కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన పీఎఫ్ఐ.. పలు జిల్లాల్లో రాళ్లదాడులు
PFI called for Kerala bandh: గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దాడులు చేసింది. ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పాటు మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారనే అభియోగాలపై ఎన్ఐఏ, ఈడీ అధికారులు దాడులు చేశారు. దాదాపుగా 100 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రాలకు సమాచారం లేకుండా పకడ్భందీగా కేంద్ర సంస్థలు ఆపరేషన్ చేశాయి.
తాజావార్తలు
-
Tom Cruise: గుర్తుపట్టలేనంతగా మారిన టామ్ క్రూజ్.. ‘డిగ్గర్’ ట్రైలర్లో షాకిచ్చిన లుక్!
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!