Allahabad HC: కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు తమ అల్లుడిపై కేసు పెట్టారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారించింది. అల్లుడిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించింది. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఇప్పటికీ సమాజపు చీకట్లను సూచిస్తోందని వ్యాఖ్యానించింది. తమ పిల్లల ఆమోదం లేకుండా చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకిస్తూ తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టే స్థాయికి వెళ్లే తల్లిదండ్రులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Also: Suhas: హ్యాట్రిక్ ఇచ్చినందుకు థాంక్స్.. మరో హ్యాట్రిక్ ఇస్తారని అనుకుంటున్నాను
నివేదిక ప్రకారం.. ఒరైలోని జలౌన్ కోర్టులో సాగర్ సవిత దాఖలు చేసిన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారిస్తోంది. తండ్రి కూతురి భర్తపై ఫిర్యాదు చేశాడు. పోక్సో, కిడ్నాప్ వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టాడు. ఈ కేసులో కూతురి భర్త తరుపున వాదించిన న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. అతను, మహిళను పెళ్లి చేసుకున్నాడని, వీరిద్దరు భార్యభర్తలుగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కూతురి పెళ్లిని ఒప్పుకోని తల్లిదండ్రులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ కూతురు తండ్రి దాఖలు చేసిన కేసుల్లోని అన్ని క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేశారు.
‘‘ ఇది మన సమాజపు చీకట్లను సూచిస్తోందని, నేటికి పిల్లల, వారికి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే సమాజం, సొంత కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడితో తల్లిదండ్రులు ఆ పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. పెళ్లి చేసుకున్న వ్యక్తులపై కేసులు పెడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు పెడుతున్నాము’’ అంటూ హైకోర్టు మండిపడింది. ఈ కేసులో 2022 నాటి ‘మఫత్‌లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసింది. భార్యభరత్లు సంతోషంగా జీవిస్తున్నప్పుడు, ఈ వివాహాన్ని అంగీకరించడంలో ఎలాంటి ఆటంకం ఉండనది చెప్పింది. దీంతో కూతురి భర్తపై ఎలాంటి విచారణ జరిపే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది.