GPS-Based Toll: వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఇక ఎదురుచూసే ఇబ్బందులు తప్పబోతున్నాయి. స్మూల్ డ్రైవింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రయాణించేలా కొత్త విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది. ప్రస్తుతం దేశంలోని హైవే టోల్ ప్లాజాల స్థానంలో GPS-ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ విధానం తసీుకువచ్చేందుకు కేంద్ర ప్రయత్నిస్తోంది. జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కన్సల్టెంట్‌ను నియమించిందని గడ్కరీ గురువారం తెలిపారు.
Russia: భారత్‌ని తమ నుంచి దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా ఆరోపించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోల్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది.
A Rare Heist: ఆర్థిక సంక్షోభం, పేదరికం, నగదు కొరతతో ఇబ్బంది పడుతున్న క్యూబా దేశంలో అరుదైన దొంగతనం జరిగింది. ఆహార కొరత ఉన్న ఆ దేశంలో దొంగలు ఏకంగా 133 టన్నుల చికెన్ దొంగలించారు. దీనంతటిని విక్రయించి వచ్చిన డబ్బుతో ల్యాప్‌టాప్, టీవీలు, రిఫ్రిజ్‌రేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేశారు. ఈ దొంగతనంలో 30 మందిపై అభియోగాలు మోపారు. దేశ రాజధాని హవానాలో ఈ దొంగతనం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Shiv Sena MLA: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో పిల్లల్ని వాడుకోవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఎమ్మెల్యే సంతోష్ బంగర్ పిల్లలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఓటేయకుంటే మీరు రెండు రోజుల పాటు తినొద్దని కోరడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిచ్చారు. రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో కొన్ని పోలింగ్ స్టేషన్లలో…
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
Valentine Day: వాలెంటైన్ డేని ప్రేమికులు ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కాంత్రి సేన మాత్రం ‘లాఠీ పూజ’ని నిర్వహించింది. లాఠీలకు నూనె రాసి పూజ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రేమికులు దినోత్సవం ముసుగులో అమ్మాయిలపై దురుసుగా ప్రవర్తించే, ఆటపట్టించే వ్యక్తులకు, లవ్ జిహాద్ వ్యాప్తి చేసే వ్యక్తులకు లాఠీలతో గుణపాఠం చెబుతామని క్రాంతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ సైనీ శనివారం వార్నింగ్ ఇచ్చారు.
Farmers' protest: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఈ మార్చ్ చేయనున్నాయి.
Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు.
Amit Shah: పొత్తుల గురించి కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మిత్రపక్షాలను ఎప్పుడూ స్వాగతిస్తామని, పాత మిత్రుడైన శిరోమణి అకాళీదళ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన శనివారం అన్నారు. రాజకీయాల్లో ‘‘ఫ్యామిలీ ప్లానింగ్’’ ఉండని చెప్పారు. జయంత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీ లోక్‌దళ్(ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ), ఇతర ప్రాంతీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో చేరే అవకాశం గురించి అడిగిన సందర్భంలో అమిత్ షా ఈ విధంగా వ్యాఖ్యానించారు.