Pakistan Elections: దక్షిణాసియాలో చర్చనీయాంశంగా పాకిస్తాన్ ఎన్నికలు మారాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలు, ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఇలా పలు సంక్షోభాల్లో చిక్కుకున్న తరుణంలో ఈ ఎన్నికలు జరిగాయి. గురువారం ఆ దేశంలో పోలింగ్ జరగ్గా, నిన్న సాయంత్రం నుంచి కౌంటింగ్ జరుగుతోంది. 24 గంటలు దాటిని ఇంకా దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఏ పార్టీ గెలుచిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
National creators' awards: ప్రస్తుత జనరేషన్లో సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇన్ఫ్లూయెన్సర్, క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ పలు సోషల్ మీడియా ఫ్లాట్ఫారామ్లు ఇందుకు వేదిక అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఏజ్ ఇన్ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ‘‘ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్’’ ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి.
Recession In Tech: ఏడాది కాలంగా టెక్ రంగం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీలైన గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటివి వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం భయంలో ఖర్చులను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు దీనికి ప్రభావితమయ్యారు. ద్యోగాల కోతలను ట్రాక్ చేస్తున్న స్టార్ట్-అప్ Layoffs.fyi ప్రకారం ఇప్పటివరకు, 2024లో దాదాపు 32,000 మంది టెక్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.
Balasaheb Thackeray: భారత ప్రభుత్వం ఈ రోజు మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్కి అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదుగురికి భారతరత్నలను ప్రకటించింది. ఇదిలా ఉంటే, పలు పార్టీలు తమ నేతలకు కూడా భారతరత్నలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Chernobyl disaster: చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అణు విద్యుత్ కర్మాగారంలో పేలుడుతో సోవియట్ యూనియన్లోని(ప్రస్తుతం ఉక్రెయిన్) ఈ ప్రాంతం శ్మశానాన్ని తలపిస్తోంది. 1986లో జరిగిన ఈ విపత్తు కారణంగా ఇప్పటికీ చెర్నోబిల్ నగరాన్ని ప్రజలు విడిచి వెళ్లారు. అణు విధ్వంసం తర్వాత ఇక్కడి వాతావరణంలో ఇప్పటికీ రేడియేషన్ ప్రభావం ఉంది. రేడియేషన్ బారిన పడితే ప్రజలు క్యాన్సర్లకు గురవుతారని ఈ ప్రాంతానికి అనుమతించడం లేదు. విపత్తు జరిగిన ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక నిషేధిత ప్రాంతాన్ని…
Election Commission: మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 18-29 ఏళ్ల మధ్య గల యంగ్ ఓటర్లు 2 కోట్ల మంది కొత్తగా ఓటర్ లిస్టులో చేరినట్లు వెల్లడించింది.
PM Modi: పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ లంచ్ చేశారు. సడెన్గా ప్రధాని తమతో లంచ్ చేయడంతో సదరు ఎంపీలు షాకయ్యారు. శుక్రవారం తన తోటి పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రధాని భోజనం చేశారు. పలు పార్టీలకు చెందిన మొత్తం 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్కి ఆహ్వానించారు. పార్లమెంట్ క్యాంటీన్లో తనతో కలిసి భోజనానికి రావాల్సిందిగా ప్రధాని వారిని అడిగారు. ‘‘మిమ్మల్ని నేను అస్సలు శిక్షించను, నాతో రండి’’ అని ఎంపీలతో ప్రధాని చమత్కరించినట్లు సమాచారం.
Pakistan elections: ముంబై దాడుల సూత్రధారి, జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీస్ సయీద్ కొడుకు తల్హా సయీద్ ఈ పాకిస్తాన్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఉగ్రవాది కొడుకు ఎన్నికల్లో పోటీ చేయడం భారత్లో చర్చనీయాంశం అయింది. పాకిస్తాన్ నగరం లాహోర్ నుంచి పోటీ చేసిన తల్హా సయీద్ తాజా ఎన్నికల్లో ఓడిపోయాడు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలు ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అభ్యర్థి గెలుపొందాడు.
Ram Mandir: అయోధ్య రామ మందిరాన్ని ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ గురువారం సందర్శించారు. అయోధ్య రాముడిని దర్శించుకున్న తొలి విదేశీ నేతగా ఫిజీ ప్రధాని నిలిచారు. గత నెల 22న అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఫిజీలో భారతీయ ప్రవాసులకు ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధి బృందానికి బియన్ ప్రసాద్ నాయకత్వం వహించారు.
Gyanvapi: ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇత్తేహాద్-ఈ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజాఖాన్ జ్ఞానవాపి వివాదంలో ‘జైల్ భరో’కి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. జ్ఞానవాపి కేసులో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా, బారికెడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు.