తమిళ చిత్ర పరిశ్రమకు ఇది నిజంగా గర్వించదగ్గ క్షణం ఇది. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ (Tourist Family) సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ పిక్చర్’ (ఉత్తమ చిత్రం) కేటగిరీలో పోటీ పడేందుకు ఈ సినిమా అధికారికంగా అర్హత సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ‘మిలియన్ డాలర్ స్టూడియోస్’ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఒక సామాన్యమైన కథతో వచ్చి, గ్లోబల్ స్టేజ్ మీద మెరవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, శ్రీలంక నుంచి వచ్చిన ఒక తమిళ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను ఎంతో హృద్యంగా, హాస్యంతో మేళవించి చూపించింది. షాన్ రోల్డన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో చోటు సంపాదించుకోవడంతో, నామినేషన్ల వరకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. జనవరి 22న ప్రకటించబోయే తుది నామినేషన్లలో ఈ సినిమా చోటు దక్కించుకుంటుందో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
A moment of immense pride for Tamil cinema ❤️✨#TouristFamily steps onto the global stage, officially eligible and in contention for the Best Picture category at the Academy Awards (Oscars).
Written & directed by @abishanjeevinth ✨
A @RSeanRoldan musical 🎶 @SasikumarDir… pic.twitter.com/Hpe8AKppSd— Million Dollar Studios (@MillionOffl) January 9, 2026