PM Surya Ghar Yojana: ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. సౌరశక్తి, స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం త్వరలో 'పీఎం సూర్య ఘర్ యోజన: ఉచిత విద్యుత్ పథకం'ని ప్రారంభించబోతోంది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లలో వెలుగులు నింపడం ఈ పథకం లక్ష్యం. ఈ ప్రాజెక్టులో రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని చెప్పారు.
Coimbatore Car Blast: 2022లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు, ఐసిస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. శనివారం నిర్వహించిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు ల్యాప్టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ కార్డులను, మూడు హార్డ్ డిస్కులను స్వాధీనం…
Agra: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యాపారవేత్త తన తల్లిని, కొడుకును హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. భార్య గుడికి వెళ్లిన సమయంలో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహత్య, హత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
Pushkar Sing Dhami: ఉత్తరాఖండ్ హల్ద్వానీలోని బన్‌భూల్‌పురా అక్రమ మదర్సా కూల్చివేత తీవ్రమైన అల్లర్లకు కారణమైంది. కూల్చివేత సమయంలో ఆ ప్రాంతంలోని వ్యక్తులు అల్లర్లకు పాల్పడటమే కాకుండా, పోలీసులపై, జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. 100కు పైగా మంది పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ అల్లర్లకు కారణమైన ప్రధాన నిందితుల కోసం పోలీసులు, నిఘా వర్గాలు వేట కొనసాగిస్తున్నాయి.
Best PM: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే, మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చే ఎన్నికల్లో కూడా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ అన్ని లోక్‌సభ స్థానాల్లోని 35,801 మంది ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ఈ సర్వే ఆధారపడింది. డిసెంబర్ 15, 2023- జనవరి 28, 2024…
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు అయోధ్య వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా ఆయన రామ మందిరాన్ని సందర్శించనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు అయోధ్య రాముడిని దర్శించుకోనున్నారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అయోధ్య యాత్రకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 266 జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు పూర్తైంది. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI)కి చెందిన నేతలు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన ‘‘పాకిస్తాన్ ముస్లింలీగ్-నవాజ్’’, బిలావల్ భుట్టో పాకిస్తాన్ పీపుల్స్…
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.
PM MODI: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మధ్యప్రదేశ్ ఝబువా నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఝబువాకు రాలేదని, ప్రజల సేవక్‌గా వచ్చానని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.