Amit Shah: ఎన్నికల ముందే సీఏఏ అమలు.. అమిత్ షా సంచలన ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని లాక్కోవడానికి కాదు’’ అని ఆయన చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్(యూపీపీ)పై దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇతరులు సంతకం చేసిన రాజ్యాంగంలోని ముఖ్యమైన ఎజెండా అని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బుజ్జగింపు రాజకీయాలతో దానిని విస్మరించాయని, ఉత్తరాఖండ్ యూసీసీ అమలు సామాజిక మార్పుగా అమిత్ షా అభివర్ణించారు. లౌకికదేశంలో మతం ఆధారిత సివిల్ కోడ్ ఉండకూడదని అన్నారు.
Read Also: Telangana Budget: త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన శనివారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తాము మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుందని గ్రహించాయని చెప్పారు. మేము ఆర్టికల్ 370ని రద్దు చేశాం కాబట్టి ప్రజలు మాకు మెజారిటీ ఇస్తారని ఆయన అన్నారు. 1947 దేశ విభజనకు నెహ్రూ-గాంధీ కుటుంబమే కారణమని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన సమయంలో దేశాన్ని ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందనే విషయాన్ని తెలిపేందుకే పార్లమెంట్‌లో శ్వేతపత్రాని సమర్పించామని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దేశ ప్రజలు 500 ఏళ్లుగా అడుగుతున్నారని చెప్పారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల రామ మందిర నిర్మాణానికి అనుమతి లభించలేదని అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!