Israel: ఇజ్రాయిల్ పౌరుల్ని అనుమతించని దేశాలు ఇవే.. వైరల్ అవుతున్న పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ముఖ్యం ముస్లిం దేశాల్లో ఇజ్రాయిల్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ పోస్టు తెగవైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన వారిని అనుమతించని దేశాల లిస్టు వైరల్ అయింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే పేజీలో ఇజ్రాయిల్ పౌరులను తమ గడ్డపైకి అనుమతించనని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ముస్లిం మెజారిటీ కలిగిన దేశాలు ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, యెమెన్ ఉన్నాయి.
Read Also: Murder: సెల్‌ఫోన్ కోసం సొంత నానమ్మనే హత్య.. ఆపై..?
Also Read
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- Muhammad Yunus: "నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు".. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
అయితే, ఈ జాబితాపై ఇజ్రాయిల్ స్పందించింది. ‘‘వి ఆర్ గుడ్’’ అని కామెంట్ చేసింది. ఇజ్రాయిల్ చట్టం ప్రకారం.. లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ శత్రు దేశాలుగా పేర్కొనబడ్డాయి. ఇజ్రాయిల్ పౌరులు ఈ దేశాలను సందర్శించాలంటే ఇజ్రాయిల్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. ఇజ్రాయిలీలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే ఏకైక మిడిల్ ఈస్ట్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ఉంది.
ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇజ్రాయిల్‌ని ద్వేషిస్తుండగా.. మరికొందరు సపోర్టు చేస్తున్నారు. 2024 నాటికి, ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులకు 171 దేశాలు వీసా-ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. అధిక మొబిలిటీ స్కోర్‌తో, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకింగ్ పాస్‌పోర్ట్‌లలో ఒకటి. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు హోల్డర్లు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణించొచ్చు. చైనా, భారత్, అమెరికా వంటి దేశాలకు ముందుగా వీసా అఫ్లై చేసుకోవాలి.
We’re good pic.twitter.com/GmiwEzZGck
— Israel ישראל (@Israel) March 14, 2024
తాజావార్తలు
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!