Indian IT CEOs: ప్రస్తుతం సమాజంలో ఐటీ జాబ్ అంటే చాలా క్రేజ్ ఉంది. చివరకు తల్లిదండ్రులు వారి కుమార్తెల పెళ్లి చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్షన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకు లక్షల్లో జీతాలు, ఆకర్షించే వార్షిక ప్యాకేజీలు ఐటీ జాబ్లకు ప్రధాన ఆకర్షణ. సాధారణ ఉద్యోగి లక్షల్లో జీతాన్ని సంపాదిస్తుంటే, ఇక ఐటీ సంస్థల సీఈఓల జీతం ఎంత ఉంటుందనే ఆసక్తి అందరికి కలుగుతుంది. కంపెనీల అభివృద్ధిలో వీరు కీలకంగా వ్యవహరిస్తుంటారు.
Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్విల్లే నార్త్ హాప్కిన్స్ హైస్కూల్లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ ప్రాంతం ఇటీవల అల్లర్లతో అట్టుడికింది. మాజీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్, అతని అనుచరులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మహిళా లోకం వీరికి వ్యతిరేకంగా ఎదురుతిరిగింది. వారిని అరెస్ట్ చేయాలని టీఎంసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూ కబ్జా, మహిళలపై వేధింపులు, రేషన్ కుంభకోణం, ఈడీ అధికారులపై దాడి ఇలా పలు కేసులో షేక్ షాజహాన్ నిందితుడిగా ఉన్నాడు. 55 రోజుల పాటు పరారీలో ఉన్న ఇతడిని కలకత్తా హైకోర్టు ఆదేశాలు, గవర్నర్…
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే లాటరీ కింగ్‌గా పిలువబడే శాంటియాగో మార్టిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మొత్తం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో ఈయన కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అగ్రస్థానంలో ఉంది. ఈ సంస్థ రూ. 1368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా.
MK Stalin: తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ బీజేపీ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే సీఏఏని తమ రాష్ట్రంలో అమలు చేయమని డీఎంకే చెబుతున్న నేపథ్యంలో.. బీజేపీ సీఏఏతో ఆగడని, దాని తరుపరి లక్ష్యం వివిధ భాషల మాట్లాడే ప్రజలే అని ఆయన ఆరోపించారు. బీజేపీ భవిష్యత్తులో వీటికి సంబంధించిన చట్టాలను తీసుకువస్తుందని ఆయన అన్నారు.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి తాజాగా ఈసీ ఈ రోజు కొత్త సమాచారాన్ని విడుదల చేసింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అగ్రకొనుగోలుదారుగా ఉన్న ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ ద్వారా…
Manoj Sharma: 12th ఫెయిల్ సినిమా భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. రియల్ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ నిజజీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. పేద కుటుంబం నుంచి వచ్చి, 12వ తరగతి ఫెయిలైన ఓ వ్యక్తి సివిల్స్ క్రాక్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలా విజయం సాధించాడనే ఇతివృత్తం ఆధారంగా విధువినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించారు.
Flipkart: ఐఫోన్ ఆర్డర్లో తలెత్తిన వివాదంలో ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart)కి వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ఒక వ్యక్తి ఐఫోన్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేసినందుకు, బాధితుడు అనుభవించిన మానసిక క్షోభకు పరిహారంగా రూ.10,000 చెల్లించాలని ఫోరమ్ ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది. ఈ క్యాన్సిల్ ఉద్దేశపూర్వకంగా అదనపు లాభాన్ని ఆర్జించడం కోసం చేశారని, ఇది సర్వీస్‌లో లోపమని, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ అన్యాయమైన వ్యాపార పద్దతులను పాటించిందని సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పేర్కొంది.
S Jaishankar: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు అంతర్జాతీయ సంస్థలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమేస్టి ఇంటర్నేషనల్, యూఎన్ హక్కుల సంస్థలు దీనిని సీఏఏని తప్పుగా భావిస్తున్నారు. వీరికి అగ్రరాజ్యం అమెరికా జతకలిసింది. సీఏఏపై ఆందోళన చెందుతున్నామని, ఇది ఎలా అమలువుతుందో నిశితంగా గమనిస్తున్నామంటూ కామెంట్స్ చేసింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన సీఏఏపై అమెరికా వ్యాఖ్యానించడాన్ని భారత్ తప్పుబడుతోంది.
Viral News: ఇటీవల కాలంలో అడ్రస్ కనుక్కోవడం చాలా సులభంగా మారింది. గూగుల్ మ్యాప్స్ విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయంలో సరైన మార్గాలను ఎంచుకోవడం సులభంగా మారింది. ఇదిలా ఉంటే కొన్ని సందర్భాల్లో మాత్రం గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కొల్పోయిన వాళ్లు ఉన్నారు. మరికొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్‌ని అనుసరిస్తూ వెళ్తే, చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో పడేయడం మనం చూస్తున్నాం.