Imran Khan: ‘‘పాకిస్తాన్‌లో ఈవీఎంలు ఉంటే’’.. ఎన్నికలపై ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-ట్యాంకర్ ఢీ.. 21 మంది మృతి..
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
పాకిస్తాన్ ఎన్నికల సంఘం, కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్ట్రిక్ ఓటింగ్ యాత్రాలను తీసుకురావాలనుకున్న తన ప్రణాళికను నాశనం చేశాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆదేశాన్ని దొంగిలించిన అధికారులపై దేశద్రోహ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎన్నికల్లో 30 మిలియన్ల ఓట్లను సాధించిందని, మిగిలిన 17 రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఇదే సంఖ్యలో ఓట్లు సాధించాయని ఆయన అన్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోషఖానా, అల్-ఖాదిర్ ట్రస్ట్ వంటి అవినీతి కేసుల్లో జైలులో ఉన్నారు. ఎన్నికల ముందు సైన్యం ఇతడిని కావాలనే జైలులో పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. పీటీఐ పార్టీ చిహ్నం ‘బ్యాట్’ని కుట్రతో తిరస్కరించారు, ప్రజలు ఇచ్చిన ఆదేశాన్ని దొంగిలించడం దేశద్రోహానికి సమానమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని దివాళా అంచును ఉండాడని ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. 2018లో నవాజ్ షరీఫ్ పార్టీ 20 బిలియన్ డాలర్ల లోటును మిగిల్చిందని, ఆ సమయంలో ఐఎంఎఫ్‌ని సంప్రదించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం లేదని, రుణాన్ని చెల్లించగలిగితే, మళ్లీ రుణాలను పొందాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
-
Antivenom: ఇక డోంట్ వర్నీ.. పామువిషానికి చెక్ పెట్టే సరికొత్త యాంటీవెనమ్ వచ్చేసింది!
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!