బాలీవుడ్‌లో లేడీ కాప్ యూనివర్శ్‌లో మర్దానీ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ. శివానీ శివాజీ రాయ్‌గా రాణి ముఖర్జీ ఫెర్మామెన్స్ టాప్ నాచ్. రూత్ లెస్ పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ పాత్రలో మెప్పించింది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మర్దానీ వన్ అండ్ టు మంచి హిట్స్. ఇప్పుడు ఎడిషన్ 3ని తీసుకురాబోతున్నారు. మర్దానీ వన్‌లో అమ్మాయిల అక్రమ రవాణా చేసే గూండాల అంతు చూస్తే.. మర్దానీ2లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే సైకో కిల్లర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగుతుంది. ఇప్పుడు ధర్డ్ ఫ్రాంచైజీలో కూడా గర్ల్ ఛైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న ముఠా అంతు తేల్చబోతోంది.
Also Read : Raviteja : ప్లాపులకు బ్రేక్.. రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేసాడు..
మర్దానీ3ని జనవరి 30న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తామని గతంలో ఎనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు దాదాపు నెల రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 0సినిమా అనుకున్న దాని కన్నా ముందే సినిమా కంప్లీట్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా రాణి ముఖర్జీ ఈ ఏడాదితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఇయర్స్ అవతున్న సందర్భంగా జనవరి 30న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారట. 30 ఇయర్స్ సినీ కెరీర్ సందర్భంగా రీసెంట్లీ ఓ ఎమోషనల్ నోట్ పంచుకుంది రాణి ముఖర్జీ. తన ఈ ప్రయాణం నమ్మశక్యంగా లేదన్న హీరోయిన్.. తన తొలి అడుగు నుండి ఇప్పటి వరకు తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. తన తొలి బాలీవుడ్ ఫిల్మ్ రాజా కీ ఆయీ హై బారాత్ చేసినప్పుడు కెరీర్ ఎలా ఉంటుందో తనకు తెలియదని, ఆ సినిమా ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చింది. సాథియా ఫిల్మ్ తన కెరీర్ మార్చిందంటూ.. బ్లాక్, బంటీ ఔర్ బబ్లీ, హమ్ తుమ్, నో వన్ కిల్డ్ జెస్సీకా, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది రాణి ముఖర్జీ.
Thank you for the love for 30 years ❤️ – Rani Mukerji pic.twitter.com/fz37yV8LmV
— Yash Raj Films (@yrf) January 12, 2026