Pradeep Sharma: 2006లో గ్యాంగ్‌స్టర్ ఛోటా రాజన్ సన్నిహితుడు రామ్‌నారాయణ్ గుప్తా బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీసు ప్రదీప్ శర్మను దోషిగా నిర్ధారించి బాంబే హైకోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. జస్టిస్ రేవతి మోహితేదేరే, గౌరీగాడ్సేలతో కూడిన డివిజన్ బెంజ్ ‘ఫేక్ ఎన్కౌంటర్’ కేసులో ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో సెషన్స్ కోర్టు 2013లో ప్రదీప్ శర్మ నిర్దోషి అని చెప్పిన తీర్పును హైకోర్ట్ తప్పుపట్టింది.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సమయం దగ్గర పడుతోంది. జూలై నెలలో ఒలింపిక్స్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. 2024 పారిస్ గేమ్స్ కోసం తాము ‘ఇంటిమసీ బ్యాన్’(సాన్నిహిత్యంగా మెలగడం) ఎత్తేసింది. శనివారం ఒలింపిక్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచాడ్ మాట్లాడుతూ.. 2024 గేమ్స్ కోసం బ్యాన్‌ని ఎత్తేస్తున్నట్లు తెలిపారు. 14,250 మంది అథ్లెట్లకు 3 లక్షల కండోమ్స్ అందుబాటో ఉంచినట్లు వెల్లడించారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం భీకరం సాగుతోంది. అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత హమాస్‌కి కేంద్రంగా ఉన్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్న అల్-షిఫా ఆస్పత్రిడిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
PM Modi: ఇండియా కూటమి నేతలు ఉద్ధేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యాడు. తమిళనాడు సేలంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం పాల్గొన్నారు. ఏప్రిల్ 19న ప్రతీ ఒక్కరూ బీజేపీ-ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్తించారు.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది.
Vinay Kumar: రష్యాలో భారత రాయబారిగా వినయ్ కుమార్‌ని నియమించినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) తెలియజేసింది. ప్రస్తుతం మయన్మార్‌లో భారత రాయబారిగా ఉన్న 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి వినయ్ కుమార్, త్వరలోనే తన బాధ్యతలు చేపడుతారని ఎంఈఏ తెలియజేసింది. ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి, మరోసారి పుతిన్ భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గెలుపు తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది.
Raj Thackeray: మహారాష్ట్ర పరిణామాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మెజారిటీ ఎంపీ సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేకి చెక్ పెట్టేందుకు బీజేపీ భారీ ప్లాన్ సిద్ధం చేసింది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్, ఉద్ధవ్ ఠాక్రే కజిన్ రాజ్ ఠాక్రేని రంగంలోకి దించింది. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్ ఠాక్రేతో భేటీ కావడంతో ఈ బీజేపీతో ఎంఎన్ఎస్ పొత్తు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎంఎన్ఎస్ దక్షిణ ముంబై,…
Supreme Court:కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. సీఏఏపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు 3 వారాల్లో స్పందించాలని కేంద్రాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సీఏఏని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభ ముంబైలో జరిగింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి నేతలు బలప్రదర్శనకు వేదికగా నిలిచింది. ముంబైలోని శివాజీ పార్కులో ఈ సమావేశం జరిగింది. మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, మెహబూబా ముఫ్తీ, స్టాలిన్, ఫరూఖ్ అబ్దుల్లా వంటి నేతలు హాజరయ్యారు.
Bharat Jodo Nyay Yatra: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్, ప్రియాంక గాంధీ వాద్రా, ఉద్ధవ్ థాకరే,…