Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యాడు.
Congress: అరవింద్ కేజ్రీవాల్‌ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నిస్తోంది. ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ, వేటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందని ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
Annamalai: బీజేపీ దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో ఎన్నడూ లేనంతగా బీజేపీకి ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి కారణం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళ సింగంగా పేరు తెచ్చుకున్న కె. అన్నామలై. 37 ఏళ్ల ఈ యంగ్ పొలిటిషియన్‌ని బీజేపీ తమ భవిష్యత్తుగా భావిస్తోంది. అందుకనే అతి తక్కువ వయసులో తమిళనాడు వంటి రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ పార్టీ అన్నామలైని చాలా స్పెషల్‌గా భావిస్తోంది.
Love Affair: లివింగ్ రిలేషన్స్, వివాహేతర సంబంధాలు హత్యలకు కారణమవుతున్నాయి. చాలుమాటు సంబంధాలు నేరాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్న వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. కేవలం 20 సెకన్ల వ్యవధిలోనే 10 సార్లు గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న సమయంలో మృతురాలు రక్తపుమడుగులో పడి ఉంది. పక్కనే నిందితుడు కూడా ఉన్నాడు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్‌శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్‌శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Crime: ఉద్యోగం చూసుకోవాలని తండ్రి కోరడమే పాపమైంది. కొడుకు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని నారిసింగ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం చూసుకోవాలని ఒత్తిడి చేయడంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేష్ ఠాకూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ కాలనీలో శవమై కనిపించాడు. అతని కొడుకు సుధాన్షు ఠాకూరు అతడిని హత్య చేశారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Pannun murder plot: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే ఆరోపణలతో భారత జాతీయుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అరెస్ట్ చేసింది. అమెరికా అధికారుల సూచన మేరకు గతేడాది నవంబర్‌లో అతడిని అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే నిందితుడికి భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా గడ్డపై అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నడాన్ని అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది.