Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
దీనికి ముందు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ ఆరెస్ట్ గురించి కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు ఈడీ అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. తాను ఈడీ విచారణకు హాజరవుతాను కానీ, తనను అరెస్ట్ చేయబోమని ఈడీ కోర్టులో హామీ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ కేసులో ఈడీ తన ప్రతిస్పందన తెలియజేయాలని కోరుతూ.. ఏప్రిల్ 22కి వాయిదా వేసింది.
Also Read
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
Read Also:Drugs: ఆపరేషన్ గరుడ.. విశాఖ సీపోర్ట్‌లో 25వేల కేజీల డ్రగ్స్ స్వాధీనం
కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా 8 నుంచి 12 మంది అధికారులు కేజ్రీవాల్ నివాసంలో ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ సమన్లను దాటవేయగా..10వ సారి సమన్లు ఇచ్చేందుకు ఈడీ బృందం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది.
#WATCH | Enforcement Directorate team reaches Delhi CM Arvind Kejriwal's residence for questioning: ED pic.twitter.com/kMiyVD6vhf
— ANI (@ANI) March 21, 2024
తాజావార్తలు
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!