Water Crisis: వేసవి కాలం పూర్తిగా రాకముందే దేశంలోని పలు నగరాలు నీటి సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. నగర వాసులకు రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా.. ఇప్పటికే 500 మిలియన్ లీటర్ల కొరత ఉంది. బెంగళూరులో 14,000 బోర్వెల్లు ఉండగా వాటిలో 6,900 ఎండిపోయాయి. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయా.?? అంటే రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని చూస్తే సంక్షోభం తప్పేలా…
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఇద్దరు కూతుళ్లను ఎన్నికల బరిలో నిలిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లాలూకు మొత్తం ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మిసా భారతి, రోహిణి ఆచార్యలను ఎంపీ ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకుంటున్నారు.
Operation Indravati: గ్యాంగ్ వార్తో కల్లోలంగా మారిన హైతీ దేశం నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం ‘‘ఆపరేషన్ ఇంద్రావతి’’ని ప్రారంభించింది. కరేబియన్ దేశమైన హైతీలో సాయుధ ముఠాలు అక్కడి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశంలో ఉన్న భారతీయులను సమీపంలో డొమినికన్ రిపబ్లిక్కి తరలించేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
Delhi liquor policy scam: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కేజ్రీవాల్‌ని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతోంది. ఈడీ తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్‌కి 10 కస్టడీని కోరారు. ఈడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ‘‘కింగ్‌పిన్’’ అరవింద్ కేజ్రీవాల్ అని తెలిపింది. ఇతను ‘‘సౌత్ లాబీ’’కి అనుకూలంగా వ్యవహరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Elephant Attack: చాలా మందికి అడవుల్లో సఫారీకి వెళ్లాలని ఆశ ఉంటుంది. దగ్గర నుంచి వన్యప్రాణులను చూడాలని అనుకుంటారు. ఇలాంటి వారికి ఆఫ్రికా దేశాలు స్వర్గధామంగా ఉంటాయి. జంతువులను చూస్తున్నంత సేపు సరదాగా ఉంటుంది, కానీ ఒకసారి అవి ఎదురుతిరిగితే ప్రాణాలు పోయేంత పనవుతుంది.
PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు భారత సరిహద్దు దేశం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని నరేంద్రమోడీకి అందించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’’ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ స్వయంగా ప్రధాని మోడీకి ప్రధానం చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గురువారం రాత్రి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కస్టడీ కోరుతూ ఈ రోజు కేజ్రీవాల్‌ని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. ఈడీ 10 రోజుల కస్టడీ కోరుతోంది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారుడని కోర్టుకు ఈడీ తెలిపింది. లిక్కర్ పాలసీ 2021-22 ద్వారా హోల్ సేల్ వ్యాపారులకు 12 శాతం, రిటైలర్లకు 185 శాతం హై ప్రాఫిట్ మార్జిన్ అందించిందని ఈడీ…
Congress: ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లు తెలిపారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.