PM Modi Bhutan Visit: ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. రేపు ప్రధాని భూటాన్ బయలుదేరాల్సి ఉంది.
Russia: యుద్ధం వద్దన్నందుకు ఓ యువతికి రష్యాలో జైలు శిక్ష విధించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఉక్రెయిన్ వ్యతిరేక ప్రచారానికి నిరసనగా, దేశ అధ్యక్ష ఎన్నికల్లో నిరసగా బ్యాలెట్ పేపర్‌పై ‘నో వార్’ అని రాసింది. దీంతో సెయింట్ పీటర్స్ బర్గ్‌కి చెందిన మహిళకు రష్యా బుధవారం 8 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ ఘన విజయం సాధించారు. ఆరేళ్ల పాటు రష్యాకి అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. 2030 వరకు ఇతని పాలన కొనసాగనుంది.
Shobha Karandlaje: బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. మార్చి 1న బెంగళూర్‌లో జరిగిన రామేశ్వరం కేఫ్ పేలుడును ఉద్దేశిస్తూ.. తమిళనాడు నుంచి వచ్చిన వ్యక్తి బాంబు పెట్టాడని వ్యాఖ్యలు చేశారు. తమిళులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోల్ ప్యానెల్ ఆదేశించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలన్స్కీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత ప్రధాని జెలన్‌స్కీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్-ఉక్రెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి కోసం కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు తీసుకురావడానికి మద్దతు ఇస్తుందని ప్రధాని, జెలన్స్కీకి తెలియజేశారు. భారతదేశం మానవతా సాయం కొనసాగిస్తుందని ఆయన చెప్పారు.
Pakistan: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న గ్వాదర్ పోర్టులో కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాక్ స్థానిక మీడియా బుధవారం నివేదించింది. భద్రతా సిబ్బంది ప్రతిదాడుల్లో ఇద్దరు దుండగులు మరణించినట్లు తెలుస్తోంది. గ్వాదర్ పోర్టు అరేబియా సముద్రంలో హర్మూజ్ జలసంధికి సమీపంలో నిర్మితమవుతోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఈ పోర్టును నిర్మిస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి చమురు రవాణాకు ఈ మార్గం కీలకంగా ఉంది. అయతే, ఈ కాల్పుల గురించి గ్వాదర్ డిప్యూటీ కమిషనర్, పోలీసులు ఇంతవరకు స్పందించలేదు.
Pakistan: పాకిస్తాన్లో బొగ్గు గని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారు. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలిపోయిన బొగ్గు గని నుంచి బుధవారం మరో 10 మంది మైనర్ల మృతదేహాలను బయటకు తీశారు.
PM Modi: రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ భారీ విజయం సాధించారు. మరో 6 ఏళ్ల పాటు రష్యా అధ్యక్షుడిగా ఉండేందుకు పుతిన్‌కి అవకాశం లభించింది. అయితే, బుధవారం భారత ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. ఇరువురు నేతలు, భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తమ ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
'Shakti' remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాస్ట్రంలోని బదౌన్ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు బాలురను స్థానికంగా ఉండే బార్బర్ సాజిత్ గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత యూపీ పోలీసులు నిందితుడిని ఎన్కౌంటర్లో చంపేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపింది. మంగళవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితులను చూపిస్తున్నాయంటూ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), అధికార బీజేపీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడింది.
CM Siddaramaiah: కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. బీజేపీలో తిరుగబాటు నాయకులను అదుపు చేయలేని బలహీన ప్రధానిగా ఆరోపించారు. శివమొగ్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ప్రతిస్పందించారు. ‘‘ దోపిడిలో భాగస్వామ్యం కావడానికి కర్ణాటకలో పోటీ నెలకొంది. సీఎం-ఇన్-వెయిటింగ్, కాబోయే సీఎం ఆశావహులు, సూపర్ సీఎం, షాడో సీఎం ఇలా కాంగ్రెస్‌లో ఉన్నారు. చాలా మంది సీఎంల నడుమ ఢిల్లీలో కలెక్షన్ మినిస్టర్ ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై, కర్ణాటక…