Death Penalty: 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితుడికి పూణే సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. పూణే జిల్లాలోని మావల్ తాలుకాలో 24 ఏళ్ల నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడిని దోషిగా తేలుస్తూ కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 2022లో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపాడు. మరుసటి రోజు నిందితుడి పెరట్లో బాలిక మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో సాక్ష్యాధారాలు దాచి పెట్టినందుకు…
Moscow Attack: రష్యా రాజధాని మాస్కోలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 60 మందికి పైగా మరణించారు. ISIS-K ఉగ్ర సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ ధృవీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్(ISIS-K) ఆఫ్ఘనిస్తార్, ఇరాన్, తుర్క్మెనిస్తాన్ దేశాల్లోని ఒక ప్రాంతాలకు పాత పదం. ఇది 2014లో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత పలు ఉగ్రవాద దాడులతో దీని పేరు మారుమోగింది.
Family Court: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక ఫ్యామిలీ కోర్టు విడాకుల కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళను తక్షణమే భర్త ఇంటికి తిరిగిరావాలని కోరింది. ఆచారబద్ధమైన సింధూరం ధరించడం హిందూ స్త్రీ విధి అని.. అది పెళ్లయినట్లు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. తన భార్య పెళ్లైన ఐదేళ్ల తర్వా తవెళ్లిపోయిందని, హిందూ వివాహ చట్టం కింద తన హక్కులను పునరుద్ధరించాలని కోరతూ ఓ వ్యక్తి ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ప్రిన్సిపల్ జడ్జ్ ఎన్పీ సింగ్ విచారించారు.
Moscow terror attack: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. మాస్కోలో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Maruti Suzuki: దేశీయ అగ్రశ్రేణి కార్ మేకర్ మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యూయల్ పంప్ లోపం కారణంగా 16,000 యూనిట్లకు పైగా కార్లను రీకాల్ చేసింది. జూలై-నవంబర్ మధ్య అమ్ముడైన రెడు కార్లను రీకాల్ చేసింది. కార్లలో లోపాల కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
South China Sea: దక్షిణ చైనా సముద్ర విషయంలో సరిహద్దు దేశాలను చైనా తన బలాన్ని చూసుకుని కవ్విస్తోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది. దురాక్రమణవాదంతో భయపెడుతోంది. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
Maldives: మాల్దీవులకు విషయం బోధపడినట్లుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం, చైనా అండ చూసుకుని భారత వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడంతోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు.
Russia: రష్యా స్వలింగ సంపర్కులపై ఉక్కుపాదం మోపుతోంది. సాంప్రదాయేతర లైంగిక సంబంధాలను ప్రోత్సహించడాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించింది. జెండర్‌కి సంబంధించి చట్టపరమైన, వైద్యపరమైన మార్పులను నిషేధించింది. ‘‘LGBT ఉద్యమం’’ని రష్యా తీవ్రవాద, ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేశారు. 10 రోజుల కస్టడీ కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, సౌత్ లాబీకి ప్రయోజనం చేకూరే విధంగా పాలసీని రూపకల్పన చేశారని, దీంట్లో వచ్చిన డబ్బును గోవా, పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారని ఈడీ కోర్టు ముందు వెల్లడించింది.
Air India: మరోసారి నిబంధనల ఉల్లంఘనలో ఎయిర్ ఇండియాకు జరిమానా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ అగ్రశ్రేణి ఎయిర్ లైనర్‌కి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) జరిమానా విధించింది. తాజాగా ఫ్లైట్ డ్యూటీ టైమ్ రెగ్యులేషన్స్ (ఎఫ్‌డిటిఎల్), ఫెటీగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్ఎంఎస్) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.