Crime: ఉద్యోగం చూసుకోవాలని తండ్రి కోరడమే పాపమైంది. కొడుకు అతడిని హత్య చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేవ్ రాష్ట్రంలోని నారిసింగ్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి ఉద్యోగం చూసుకోవాలని ఒత్తిడి చేయడంతో పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాకేష్ ఠాకూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధాకృష్ణ కాలనీలో శవమై కనిపించాడు. అతని కొడుకు సుధాన్షు ఠాకూర్ అతడిని హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: BJP: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై ఎక్కడ నుంచంటే..!
పోలీసులు ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకుంది. తండ్రి తన కొడుకును ఉద్యోగం గురించి తరుచూ అడిగేవాడని, ఏదైనా పనిచూసుకోవాలని చెప్పేవాడని తెలిపింది. ఈ కారణంగా మంగళవారం అర్ధరాత్రి, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొడుకు సుధాన్షు, రాకేష్ తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
గతంలో ఇలాంటి ఘటనే ఢిల్లీలోని షాబాద్ డెయిరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు జాబ్ కోసం ఒత్తిడి చేయడంతో 22 ఏళ్ల యువకుడు ఆదివారం తండ్రిని కత్తితో పొడిచాడు. బాధితుడిని అమర్జీత్‌గా అతని కొడుకు, నిందితుడిని సందీప్‌గా గుర్తించారు. అంతకుముందు మధ్యప్రదేశ్ జబల్ పూర్‌లో మార్చి 16న ఒక మైనర్ బాలిక, తన తండ్రిని 8 ఏళ్ల సోదరుడిని హత్య చేసింది. లవ్ ఎఫైర్ పెట్టుకున్న బాలిక, పొరుగింటి వ్యక్తితో పారిపోయిందని పోలీసులు తెలిపారు.