Anil Ravipudi: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా జనవరి 12న విడుదలై.. సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ రోజు చిత్ర బృందం థ్యాంకు మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఇదే షాకింగ్ థింగ్ అంటూ ఆయన ఒక విషయాన్ని రివీల్ చేశాడు. ఇంతకీ ఆ షాకింగ్ విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Thummala Nageswara Rao : రాజకీయం తపస్సులా చేశాను..
చిత్ర రచయిత, దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” నిజానికి ఒక సినిమా స్క్రిప్ట్ రాయడానికి మూడు నెలలు, అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.కానీ నా కెరీర్‌లోనే అత్యంత వేగంగా రాసిన స్క్రిప్ట్ ఇది. మొదటి భాగం 15 రోజుల్లో, రెండో భాగం 10 రోజుల్లో పూర్తి చేశాను. మొత్తంగా ఈ సినిమా స్క్రిప్ట్‌ను 25 రోజుల్లో పూర్తి చేశాం. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఇంత త్వరగా స్క్రిప్ట్ రాయగలిగాను” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ.. సినిమా చూసిన చిరంజీవి అభిమానులు తను కనిపిస్తే ముద్దు పెట్టాలని చూశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Hamas: ఉగ్ర సంస్థకు కొత్త సుప్రీం నాయకుడు.. ఈ నెలలోనే ఎన్నికలు!