India fertility rate: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంతానోత్పత్తి రేటు(ఫర్టిలిటీ రేట్) పడిపోతోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తక్కువ సంతానోత్పత్తి రేటును ఎదుర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే ఇండియాలో కూడా సంతానోత్పత్తి రేటు 1950లో దాదాపుగా 6.2 శాతంగా ఉంటే 2021 నాటికి 2కి పడిపోయినట్లు ది లాన్సెట్ అధ్యయనం తెలిపింది.
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కి రేపటి వరకు సమయం ఇచ్చింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లకు సంబంధించి బలవంతపు చర్య నుండి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు ఈరోజు నిరాకరించింది.
Electoral bonds: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివరాలను కేంద్రం ఎన్నికల సంఘానికి అందించింది. బాండ్లకు సంబంధించి అన్ని ముఖ్యమైన ప్రత్యేక నంబర్లను కూడా అందించింది. ఇది నిధులు ఇచ్చిన దాతలు, తీసుకున్న పార్టీల వివరాలను సరిపోల్చడానికి సహాయపడుతుంది. బ్యాంక్ ఇచ్చిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలో తన వెబ్సైట్లో పొందుపరుచనుంది. అకౌంట్ నంబర్, కేవైసీ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
Women Employment: ఇటీవల కాలంలో మహిళ ఉపాధి ధోరణలు పెరుగుతున్నాయి. ప్రతీ రంగంలో వారి ప్రాతినిధ్యం కనిపిస్తోంది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో వీరికి మంచి ఉపాధి లభిస్తోంది. ఇదిలా ఉంటే మహిళలకు ఉపాధి కల్పించే విషయంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే మహిళా శ్రామిక శక్తికి భాగ్యనగరం గమ్యస్థానంగా నిలుస్తోంది. పూణే, చెన్నై నగరాలు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Sadananda Gowda: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సిట్టింగ్ ఎంపీ డీవీ సదానంద గౌడ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. బెంగళూర్ నార్త్ సీటు నుంచి వేరే అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన కలత చెందానని, దీంతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సదానంద గౌడ గురువారం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజేని బీజేపీ బరిలోకి దింపింది. ప్రస్తుతం శోభ ఉడిపి చిక్ మగళూర్ నుంచి…
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను వరసగా ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏడు దశాబ్ధాల భారత ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల సంఖ్య తొలిసారిగా 14 నుంచి 6కి పడిపోయింది. 1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేయగా.. ప్రస్తుతం దేశంలో 2500కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి.
Madhya Pradesh: ఓ కొడుకు తల్లిపై ప్రేమను చాటుకున్నాడు. ఏకంగా తన చర్మంతో తల్లికి చెప్పులు కుట్టించాడు. రామాయణ బోధనల స్పూర్తితో ఆయన ఈ పనిచేశాడు. తన శరీరంలోని చర్మం కొంత భాగాన్ని ఉపయోగించి తల్లికి ఈ బహుమతిని అందించాడు. అతని త్యాగం తల్లితో సహా అందర్ని కంటతడి పెట్టించింది. ఒకప్పుడు రౌడీ షీటర్‌గా ఉన్న వ్యక్తి, రామాయణంలో స్పూర్తిపొంది మంచి మార్గాన్ని ఎంచుకున్నారు.
Indonesia: ప్రపంచంలో మూడో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండోనేషియాకు కొత్త అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో(72) ఎన్నికైనట్లుగా ఆ దేశ ఎన్నికల సంఘం బుధవారం తెలిపింది. రక్షణ మంత్రిగా ఉన్న ప్రబోవో ప్రస్తుతం అధ్యక్షుడు కాబోతున్నారు.
Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.