Vivo V70: Vivo V70 సిరీస్‌పై గత కొన్ని రోజులుగా అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. వీటిని కంపెనీ అధికారికంగా ఇంకా వివరాలు వెల్లడించనప్పటికీ.. లీకులు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం Vivo V70 సిరీస్‌లో Vivo V70, Vivo V70 Elite అనే రెండు మోడళ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఓ ప్రముఖ నివేదిక ప్రకారం Vivo V70 సిరీస్‌ను భారత్‌లో ఫిబ్రవరి మధ్యలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది Vivo V సిరీస్‌లో తొలిసారిగా ZEISS, సోనీ, వివో, క్వాల్కమ్ సంస్థల సాంకేతికలతో రానున్న స్మార్ట్‌ఫోన్ లైనప్‌గా ఉండనుందని సమాచారం. వివో ZEISS లెన్స్ టెక్నాలజీని Sony పెద్ద సెన్సార్‌లతో కలిపి, లైట్ సెన్సిటివిటీ అండ్ ఇమేజ్ క్లారిటీని మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి తోడుగా వివో స్వంత AI ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ ఆల్గోరిథమ్స్ పనిచేస్తాయని సమాచారం. లైటింగ్ బాగాలేని పరిస్థితుల్లో కూడా అత్యుత్తమ ఫోటోగ్రఫీ అనుభవం అందించేలా ఈ సిరీస్‌ను “పాకెట్ స్టూడియో”గా నిలపాలని చూస్తోంది వివో.
Bandi Sanjay: కరీంనగర్‌కు రూ.50 కోట్ల కేంద్ర నిధులు.. కాషాయ జెండా ఎగరడం ఖాయం..!
Vivo V70, V70 Elite స్మార్ట్‌ఫోన్లు OriginOS 6తో ఔట్-ఆఫ్-ది-బాక్స్ వచ్చే తొలి V సిరీస్ మోడళ్లుగా ఉండనున్నాయి. Origin Island, Office Kit, Flip Cards వంటి ఫీచర్లతో మరింత ఫ్లూయిడ్, ప్రీమియం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు సమాచారం. అలాగే వివో V70 ఎలైట్ మోడల్‌లో ఇప్పటివరకు V సిరీస్‌లో ఉపయోగించిన అత్యంత Qualcomm ప్రాసెసర్ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి.
లీకుల ప్రకారం.. వివో V70 స్టాండర్డ్ మోడల్, Vivo S50కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే ఈ ఫోన్‌లో 6.59 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ HBM బ్రైట్‌నెస్ ఉండే అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ అందుబాటులో ఉండొచ్చు.
Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: 7-సీటర్ కారులో బెస్ట్ ఏదంటే..!
ఇంకా కెమెరా విభాగంలో 50MP OIS ప్రైమరీ సెన్సర్, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని సమాచారం. అలాగే 6,500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ ఉండబోతున్నాయి.