Venu Goapl Reddy
Author- NTV Telugu-
Haryana Elections: కాంగ్రెస్ గెలిచే వాతావరణాన్ని సృష్టిస్తే, ఆయన నాశనం చేశాడు.. రైతు నాయకుడి సంచలన వ్యాఖ్యలు..
Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్‌కి రైతులు ‘‘అనుకూల వాతావరణాన్ని’’ సృష్టించారని, అయితే దానిని విజయంగా మార్చడంలో ఆ పార్టీ విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. ‘‘హుడా కాంగ్రెస్ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం..అతను ఎవరితో కాంప్రమైస్ కాలేకపోయాడు. పార్టీ అన్ని బాధ్యతలు అతడి పైనే ఉంచింది’’ అని అన్నారు. -
BJP: “సీఎం సిద్ధరామయ్యకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం”.. ఉగ్రవాది వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్..
BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్‌గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు. -
Gauri Lankesh murder: గౌరీ లంకేష్ హత్యా నిందితులకు హిందూ అనుకూల సంఘాల నుంచి ఘనస్వాగతం..
Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్మోర్, మనోహర్ యాదవ్‌లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు. -
Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్‌కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..
Salman Khan: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిక్‌ని కాల్చి చంపారు. -
Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్‌పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి. -
Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
Hamas: హమాస్ అక్టోబర్ 07, 2023 దాడికి ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. దాడుల కోసం హమాస్ మిలిటరీ, పొలిటికల్ నాయకుడు దాదాపుగా రెండేళ్ల పాటు వరసగా సమావేశాలు నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 07 నాటి దాడిలో హమాస్, దక్షిణ ఇజ్రాయిల్లోకి ప్రవేశించి 1200 మందిని చంపింది. 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్‌పై విరుచుకుపడుతోంది. గాజాలో దాడుల్లో ఇప్పటి వరకు 40 వేలకు పైగా మంది మరణించారు. -
Baba Siddique Murder: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. బాబా సిద్ధిక్ హత్యపై రాజకీయ దుమారం..
Baba Siddique Murder: ప్రముఖ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య ఆ రాష్ట్రంలో పొలిటికల్ దుమారానికి కారణమైంది. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాయలం సమీపంలో గత రాత్రి కాల్చి చంపారు. ఈ హత్యని రాజకీయం చేయవద్దని బీజేపీ నేతృత్వంలోని మహా ప్రభుత్వం అభ్యర్థించగా.. -
Crime: బాయ్‌ఫ్రెండ్‌ని నమ్మి వెళ్తే.. 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Crime: బాయ్‌ఫ్రెండ్ నమ్మి వెళ్లిన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని ఘజియాబాద్‌లో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆమె ప్రియుడు, అతని ముగ్గురు స్నేహితులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ప్రియుడితో పాటు అతని ఇద్దరు మైనర్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక లవర్ని చాంద్‌గా గుర్తించారు. -
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తామని బెదిరింపులు..
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. -
BJP: టెర్రరిస్టులకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ఇలాగే మాట్లాడుతుంది.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?