Samsung Galaxy A07 5G: శాంసంగ్ కంపెనీ A-సిరీస్ లైనప్‌లో కొత్తగా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Samsung Galaxy A07 5G స్మార్ట్ ఫోన్ ను థాయ్‌లాండ్ మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన Galaxy A07 4Gకి ఇది 5G వెర్షన్ కాగా.. పెద్ద బ్యాటరీతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందిస్తోంది. ఈ మొబైల్ బ్లాక్, లైట్ వైలెట్ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. భారత్‌లో లాంచ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.
Bumper Discounts: త్వరపడండి..! ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు..
Samsung Galaxy A07 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Galaxy A07 5Gలో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 800 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. వాటర్‌డ్రాప్ నాచ్‌లో సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 6nm ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంది. ఇది గరిష్టంగా 6GB RAM, 128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రత్యేక స్లాట్ ద్వారా 2TB వరకు మైక్రోSD కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ కూడా ఉంది.
గాలక్సీ A07 5G ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0తో వస్తుంది. శాంసంగ్ ఈ ఫోన్‌కు 6 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్లు అందిస్తామని అధికారికంగా ప్రకటించింది. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇది పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా (f/1.8), 2MP డెప్త్ సెన్సర్, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. అలాగే 6,000mAh భారీ బ్యాటరీ, ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
Galaxy A07 5Gలో 5G Sub-6, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.3, GPS వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. IP54 రేటింగ్ తో డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ లభిస్తుంది. ప్రత్యేక Key Island డిజైన్ తో పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉన్నాయి. పవర్ బటన్‌నే సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ గా ఉపయోగించారు. థాయ్‌లాండ్‌లో ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ THB 5,499 (రూ.15,800), 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ THB 5,999 (రూ.17,200) గా ఉన్నాయి.