Venu Goapl Reddy
Author- NTV Telugu-
Air India:న్యూఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపులు.. కెనడాకు దారి మళ్లింపు..
Air India: ఆన్లైన్లో బెదిరింపులు రావడంతో న్యూఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా డైరెక్ట్ ఫ్లైట్‌ని కెనడాలోని ఇకల్యూబ్ ఎయిర్‌పోర్టుకి మళ్లించారు. -
S Jaishankar: SCO సమ్మిట్ కోసం పాకిస్తాన్ చేరిన జైశంకర్..
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (CHG) 23వ సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ చేరుకున్నారు. ఇస్లామాబాద్‌లో ల్యాండ్ అయిన జైశంకర్‌కి అక్కడి అధికారులు ఆహ్వానం పలికారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. కాశ్మీర్, సీమాంతర ఉగ్రవాదం వంటి సమస్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దాదాపుగా 9 ఏళ్ల తర్వాత భారత్ నుంచి ఓ విదేశాంగ మంత్రి పాకిస్తాన్ వెళ్లడం ఇదే తొలిసారి. -
India-Canada Conflict: కెనడా ప్రధానిలో మొదలైన భయం.. భారత్-కెనడాల మధ్య వాణిజ్య బంధం దెబ్బతింటుందా..?
India-Canada Conflict: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాపులారిటీ అక్కడ రోజురోజుకు పడిపోతోంది. మరోవైపు ప్రభుత్వంపై కొందరు ఎంపీలు అసమ్మతి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటిన్నింటి పక్కకు తప్పించి, మరోసారి సిక్కులు, సిక్కు ఎంపీల మద్దతు పొందేందుకు ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యని ముందుకు తీసుకువచ్చారు. ఈ కేసులో కెనడాలోని భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య దౌత్యయుద్ధం మొదలైంది. భారత్ ఇప్పటికే […] -
CM Yogi: ఆహార పదార్థాల్లో ఉమ్మేయడం, మూత్రం కలపడం చేస్తే అంతే.. ఆర్డినెన్స్ దిశగా యోగి సర్కార్..
CM Yogi: ఇటీవల కాలంలో ఆహారంలో ఉమ్మివేయడం, జ్యూస్‌లో మూత్రం కలపడం వంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కస్టమర్లని ఇలాంటి ఘటనలతో మోసం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, వీటిపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో యూపీ గవర్నమెంట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. -
Europa Clipper Probe: జూపిటర్ వద్దకు బయలుదేరిన “యూరోపా క్లిప్పర్ ప్రోబ్”.. గురుడి చందమామ లక్ష్యం..
Europa Clipper Probe: సౌరకుటుంబంలో గ్రహాలకు పెద్దన్న బృహస్పతి(గురుడి) వద్దకు నాసాకు చెందిన ‘‘యూరోపా క్లిప్పర్ ప్రోబ్’’ ప్రయాణం మొదలైంది. సోమవారం ఫ్లోరిడా నుంచి అంతరిక్ష నౌక బయలుదేరింది. 2.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోని గురుడిని చేరుకోవడానికి అంతరిక్ష నౌక ఏకంగా 5.5 ఏళ్ల పాటు ప్రయాణించనుంది. 2030 నాటికి జూపిటర్ కక్ష్యలోకి చేరుకుంది. నిజానికి ఈ ప్రయోగం గత వారం ప్లాన్ చేసినప్పటికీ.. మిల్టన్ హరికేన్ కారణంగా నిలిపేయబడింది. -
Waqf bill: వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వాగ్వాదం.. మహిళలకు చోటుపై ప్రతిపక్షాల అభ్యంతరం..
Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి. -
India-Canada Ties: ఖలిస్తానీ సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్లాన్.. అందుకే భారత్‌తో దౌత్యయుద్ధం..
India-Canada Ties: ఇండియా కెనడా మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దౌత్య సంబంధాలు దిగజారాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలు ‘‘ఆసక్తి గత వ్యక్తులు’’ అంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
Crime: లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్ కోసం వృద్ధుడి హత్య..
Crime: గుజరాత్‌లోని కచ్‌లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. -
Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్య కేసులో ట్విస్ట్.. నిందితుల్లో ఒకరికి ‘‘బోన్ అసిఫికేషన్ టెస్ట్’’
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి. -
Salman Khan: ‘‘సల్మాన్ ఖాన్‌కి సహకరిస్తే చావే’’.. బాబా సిద్ధిక్ హత్య తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..
ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్‌తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్‌కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?