Venu Goapl Reddy
Author- NTV Telugu-
US Presidential Elections: అమెరికా అధ్యక్షుడుని గెలిపించేవి ఈ 7 స్వింగ్ స్టేట్స్.. ట్రంప్, కమలా హారిస్ మధ్య టైట్ ఫైట్..
US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నెల రోజులు మాత్రమే ఉంది. డెమెక్రాట్ల తరుపున ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు. నవంబర్ 05న జరగబోయే ఎన్నికల్లో ఇరువురి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్లు పోల్స్ తెలుపుతున్నాయి. ముఖ్యంగా యూఎస్‌కి కాబోయే అధ్యక్షుడు ఎవరనేది తెలియజేసే స్వింగ్ స్టేట్స్లో కూడా ఇద్దరి మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంది. -
Pakistan: కరాచీ దాడికి పాల్పడింది బీఎల్ఏ.. విదేశీ గూఢచార సంస్థతో సంబంధం..
Pakistan: ఇటీవల పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో చైనీయులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపుల పేలుడు కారణంగా ఇద్దరు చైనా పౌరులు మరణించగా, 17 మంది గాయపడ్డారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా-పాకిస్తాన్ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతోనే దాడి జరిగినట్లు అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. -
Kolkata: కోల్‌కతా దుర్గాపూజా మండపంపై ముస్లింగుంపు దాడి.. విగ్రహాలు ధ్వంసం చేస్తామని బెదిరింపు..
Kolkata: కోల్‌కతాలో కొందరు మతోన్మాదుల ముస్లింమూక దుర్గా విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించిన వీడియో వైరల్‌గా మారింది. నగరంలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలోని న్యూ బెంగాల్ స్పోర్టింగ్ క్లబ్‌కి చెందిన పూజా మండపై ముస్లిం గుప్పు దాడి చేసి, పూజలు నిర్వహించరాని బెదిరించారు. దాదాపుగా 50-60 మంది సభ్యులతో కూడిన ముస్లిం గుంపు వేడకల్ని ఆపకపోతే విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. Read Also: India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ […] -
India – Bangladesh: క్రమపద్ధతిలో హిందువుల, హిందూ ఆలయాలపై దాడులు.. బంగ్లాదేశ్ తీరుపై భారత్ ఆగ్రహం..
India - Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా రాడికల్ ముస్లింగుంపు దాడులకు తెగబడుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయి, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది. -
Pakistan: EAM జైశంకర్ పాకిస్తాన్ పర్యటన.. రావాల్సిండిలో 144 సెక్షన్ విధించిన పాక్ సర్కార్..
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి మద్దతుగా ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్ కేంద్రంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సిఓ) సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశానికి భారత్ తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెళ్లబోతున్నారు. -
Allahabad HC: భార్య భర్త లైంగిక కోరికలు తీర్చకుంటే.. అతను ఎక్కడికి వెళతాడు..?
Allahabad HC: ఒక వ్యక్తిపై భార్య దాఖలు చేసిన వరకట్న వేధింపుల ఆరోపణల్ని అలహాబాద్ హైకోర్టు తప్పుపబ్టింది. వ్యక్తిగత వివాదాల కారణంగా ఆమె ఆరోపణలు చేసిందని కోర్టు భావించింది. మహిళ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్కి తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో హైకోర్టు మహిళ ఆరోపణల్ని కొట్టిపారేసింది. వరకట్న వేధింపులతో పాటు తన భర్త అసహజ సెక్స్‌కి బలవంతంగా చేస్తున్నాడని మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలు అన్నింటి కోర్టు కొట్టివేసింది. -
RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..
RSS Chief: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్ వేదికగా దసరా ప్రసంగాన్ని ఇచ్చారు. గత కొన్నేల్లుగా మెరుగైన విశ్వసనీయతతో భారతదేశం ప్రపంచంలో మరింత పటిష్టంగా, మరింత గౌరవంగా మారిందని ఆయన అన్నారు. అయితే, దుష్ట కుట్రలు దేశ సంకల్పాన్ని పరీక్షిస్తున్నాయని శనివారం భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లో భారత్‌కి ముప్పు పొంచి ఉందని, రక్షణగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చేతులు కలుపొచ్చని ప్రచారం జరుగుతోందని అన్నారు. పరిస్థితి అనుకూలంగా ఉన్నా.. లేకున్నా వ్యక్తిగత, జాతీయ స్వభావాల దృఢత్వం, ధర్మం యొక్క విజయానికి బలమైన పునాదిగా మారుతుందని… -
Haryana elections: ఓటమి తర్వాత బాలికలకు ఫ్రీ బస్ సర్వీస్‌ని నిలిపేసిన ఎక్స్-ఎమ్మెల్యే..
Haryana elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ చేతిలో అనూహ్యమైన ఓటమితో కాంగ్రెస్ హైకమాండ్, కార్యకర్తలు ఢీలా పడ్డారు. చాలా చోట్ల తాము గెలుస్తామని అనుకున్నప్పటికీ ఓటమి మరోసారి పలకరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హర్యానాలో 48 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, 37 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. -
Iran: “ఇజ్రాయిల్‌కి సాయం చేయవద్దు, లేదంటే”.. సౌదీ, యూఏఈలకు ఇరాన్ వార్నింగ్..
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమువుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ ప్రాక్సీలైన హిజ్బుల్లా, హమాస్‌లను హతం చేస్తోంది. ఇప్పటికే హిజ్బుల్లా కీలక నాయకుడు హసన్ నస్రల్లాని చంపేసింది, ఆ తర్వాత హిజ్బుల్లా చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న హసీమ్ సఫీద్దీన్‌ని కూడా చంపేసింది. హిజ్బుల్లా ప్రధాన కమాండర్లని చంపేసింది. ఇదిలా ఉంటే, హజ్బుల్లాపై దాడికి ప్రతిస్పందనగా, ఇటీవల ఇరాన్ 200కి పైగా బాలిస్టిక్ మిస్సైళ్లను ఇజ్రాయిల్ పైకి ప్రయోగింది. -
Mallikarjun Kharge: బీజేపీ టెర్రరిస్టుల పార్టీ.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల కాంగ్రెస్‌ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇటీవల ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ‘‘అర్బన్ నక్సల్స్’’ పార్టీ అని అన్నారు. దీనికి ప్రతిస్పందనగా ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?