Karnataka: బెంగళూర్ రామేశ్వర్ కేఫ్ బాంబు పేలుడు ఘటన కర్ణాటకలో రాజకీయ అస్త్రంగా మారింది. ఇటీవల బీజేపీ కార్యకర్తకు నిందితులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. పేలుడు ఘటనకు బీజేపీకి ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ విమర్శలు గుప్పించారు.
ముస్లిం మహిళ టబూ రావుతో గుండూరావు వివాహాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ నేత ఇళ్లు సగం పాకిస్తాన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గూండూ రావు ఇంట్లోనే పాకిస్తాన్ ఉందని, అందుకే దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.
Read Also: Madhya Pradesh HC: “లివ్-ఇన్ రిలేషన్ షిప్” బ్రేకప్ తర్వాత మహిళ విషయంలో సంచలనాత్మక తీర్పు..
రామేశ్వర కేఫ్ పేలుడు కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బీజేపీ కార్యకర్తను ప్రశ్నించిన విసయాన్ని గుండూరావు ట్వీట్ చేయడంతో బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే, వ్యక్తిగతంగా దాడి చేయడంతో గుండూరావు భార్య టబు నుంచి తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. ‘‘ దినేష్ గుండూ రావు ఇళ్లు సగం పాకిస్తాన్ అని యత్నాల్ చేసిన వ్యాఖ్య చాలా చౌకబారుది అని, అవమానకమైనదని, పరువు నష్టం కలిగించేది అని ఆమె విమర్శించారు. తాను ముస్లింగా పుట్టి ఉండొచ్చు, కానీ నా భారతీయతను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని టబు రావు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చర్యలు తీసుకుంటారా..? అని ఆమె ప్రశ్నించారు. తన భర్తను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ నాయకులు తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.