Venu Goapl Reddy
Author- NTV Telugu-
Nayab Singh Saini: హర్యానా బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ నేతగా నయాజ్ సింగ్ సైనీ.. రేపు సీఎంగా ప్రమాణం..
Nayab Singh Saini: హర్యానా బీజేపీ శాసనపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఎంపికయ్యారు. అక్టోబర్ 17 అంటే రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హర్యానాకు రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ కట్టడ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలంతా నయాబ్ సింగ్ సైనీని తమ నేతగా ఎన్నుకున్నారు. -
S Jaishankar: పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్..
S Jaishankar: షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు. -
Indigenous Bullet Trains: 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బుల్లెట్ ట్రైన్..
Indigenous Bullet Trains: భారతదేశం తన తొలి స్వదేశీ ‘‘బుల్లెట్ ట్రైన్’’ తయారీకి సిద్ధమవుతోంది. మొదటి బుల్లెట్ ట్రైన్ బెంగళూర్‌లో తయారు చేయబడుతోందని అంతా అనుకుంటున్నారు. దీని వేగం గంటలకు 280 కి.మీ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపరేషనల్ స్పీడ్ 250 వేగం ఉంటుంది. ఈ రైలు డిసెంబర్ 2026 నాటికి అందుబాటులోకి రానుంది. -
India-Canada Row: ‘‘తీవ్రంగా పరిగణించాలి’’.. కెనడాకు వంతపాడిన అమెరికా..
ఇదిలా ఉంటే, కెనడా చేస్తున్న అసంబద్ధ ఆరోపణలకు అమెరికా వంత పాడుతోంది. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా భారత్‌ని కోరింది. మంగళవారం వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి మాథ్యూమిల్లర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణల్ని ‘‘తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’’ అని అమెరికా స్పష్టం చేసింది. -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా.. ప్రభుత్వంలో చేరని కాంగ్రెస్..
Jammu Kashmir: దాదాపుగా 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్సీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి మొత్తం 90 స్థానాల్లో 48 గెలిచాయి. అయితే, ఎన్సీ 42 సీట్లు గెలవగా, కాంగ్రెస్ 06 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఎన్సీకి ఇండిపెండెంట్లు, ఆప్ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అవసరం లేకుండానే ఎన్సీ మెజారిటీ మార్క్ 46ని దాటింది. -
Salman Khan: సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత.. 24/7 పోలీస్ పెట్రోలింగ్, AI- ఎనేబుల్డ్ సీసీటీవీల నిఘా..
Salman Khan: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హత్యను తామే చేశామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌తో స్నేహం కారణంగానే ఇతడిని చంపేసినట్లు సోషల్ మీడియా పోస్టులో ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద భద్రతను పెంచారు. ఈ ప్రాంతం చుట్టూ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 60 మంది పోలీసులు అనుమానాస్పద కార్యకలాపాలను పర్యవేక్షించడానికి 24/7… -
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ నినాదాలు చేయడం మత భావాలను దెబ్బతీయదు..
Karnataka High Court: మసీదు లోపల ‘‘జై శ్రీరాం’’ అంటూ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మసీదులోపలన జైశ్రీరాం అని అరవడం ఏ తరగతి మనోభావాలను , మత భావాలను ఉల్లంఘించలేదు అని పేర్కొంది. మసీదులో నినాదాలు చేసిన ఇద్దరు వ్యక్తులపై మత విశ్వాసాలను అవమానపరిచారని నమోదైన క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని కోర్టు రద్దు చేసింది. -
Hoax bomb threats: ఢిల్లీ-చికాగో ఎయిరిండియాతో సహా 5 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు..
Hoax bomb threats: నకిలీ బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. మంగళవారం పలు విమానాలకు ఆన్లైన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంతో పాటు నాలుగు డొమెస్టిక్ విమానాలకు కూడా ఇదే తరహా బెదిరింపులను ఎదుర్కొన్నాయి. జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్, సిలిగురి-బెంగళూరు ఆకాస ఎయిర్ విమానాలకు బాంబు వచ్చాయి. -
Bishnoi community: బిష్ణోయ్ వర్గానికి కృష్ణజింకలు అంటే ఎందుకంత ప్రేమ..? ఇదే సల్మాన్ ఖాన్ని వెంటాడుతోందా..?
Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? -
India-Canada: ఇండియా-కెనడా దౌత్యయుద్ధం.. వీసాలు, భారతీయ స్టూడెంట్స్పై ప్రభావమెంత..?
India-Canada: భారత్ కెనడాల మధ్య మరోసారి దౌత్యయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు పలువురికి సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఫైర్ అయింది. కెనడాలో తమ భారతీయ హైకమిషనర్‌తో సహా ఆరుగురిని విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఇండియాలో కెనడాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలు శనివారం లోగా భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఈ పరిణామాలతో […]
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?