Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎన్నికలకు సరిపోతుందని శనివారం ఆరోపించారు. మరోవైపు, లౌకిక, సమ్మిళిత తత్వాన్ని బీజేపీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటమని తమ మేనిఫెస్టో లక్ష్యమని చెప్పింది.
Read Also: Minister Buggana Rajendranath Reddy: నీకు నచ్చిన ఆట ఏదైనా చెప్పు నేను రెడీ.. గెలువు చూద్దాం..!
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ సమాజాన్ని విభజించే లక్ష్యం పెట్టుకుందని ఆరోపించారు. ఇది బుజ్జగింపు రాజకీయమని, ఇది భారత ఎన్నికల కోసం కాదని, పాకిస్తాన్ ఎన్నికల మేనిఫెస్టోలా కనిపిస్తోందని విమర్శించారు. దేశంలో ఏ వ్యక్తి అయినా, హిందువు లేదా ముస్లింలు అయినా ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణ కోరుకోరని, బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి మద్దతు ఇవ్వరని ఆయన అన్నారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. అస్సాం రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని హిమంత శర్మ అన్నారు.
శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసింది. 5 ‘‘పిల్లర్స్ ఆఫ్ జస్టిస్’’ కింద 25 హామీలను ప్రకటించింది. రైతులకు ఎంఎస్పీ కల్పించడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లకు 50 శాతం కన్నా పరిమితి పెంపుకు రాజ్యాంగ సవరణ, దేశవ్యాప్తంగా కులగణణ, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం వంటి హామీలను ఇచ్చింది.