Bheems Ceciroleo: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!
సక్సెస్ మీట్‌లో భీమ్స్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 25 ఏళ్లు అవుతోంది. ఇది నా సిల్వర్ జూబ్లీ లాంటిది. ఒకప్పుడు మా నాన్న నన్ను చూసి.. ‘నువ్వు దేనికీ పనికిరావురా, నీవల్ల ఏంటి ఉపయోగం?’ అని రోజూ తిట్టేవారు. కానీ ఈరోజు సగర్వంగా మా నాన్నకు సమాధానం చెప్పుకోగలను. నా ముందు అనిల్ రావిపూడి, నా వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు.. నేను వీరిద్దరి మధ్యలో నిలబడ్డాను. అంతకంటే ఇంకేం కావాలి?” అని ఆనందం వ్యక్తం చేశారు.
తనను నమ్మి, ఎన్నో ఆటంకాలు ఎదురైనా భుజాల మీద ఎత్తుకుని నడిపించిన దర్శకుడు అనిల్ రావిపూడికి భీమ్స్ పాదాభివందనం అంటూ మాట్లాడారు. అనిల్ నన్ను తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్నారు. పాటకంటూ ఒక గౌరవాన్ని, స్వేచ్ఛను ఇచ్చారు అని కొనియాడారు. తన వెన్నంటి ఉన్న మాల్యాను గుర్తు చేసుకుంటూ “నువ్వు లేకుండా నేను లేను” అని ఎమోషనల్ అయ్యారు. అలాగే కీబోర్డ్ ప్లేయర్ మిథున్, వైది, అగస్త్య, హెల్విన్, రచయితలు భాస్కర్ బట్ల, శ్యామ్ కాసర్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
చివరగా.. స్క్రీన్ మీద నా పాటలు హుక్కు స్టెప్పులతో ఊర మాస్‌గా ఉంటే, ఇక్కడ భీమ్స్ ఇంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడేంటి అనుకోవద్దు.. ఇవి నా మనసులో మాటలు అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.