Honour Killing: మహారాష్ట్ర నాందేడ్‌లో ‘‘పరువు హత్య’’ సంచలనంగా మారింది. తన కూతురును ప్రేమించడానే కారణంతో తండ్రి, 20 ఏళ్ల యువకుడిని కాల్చి, తలను రాయితో కొట్టి చంపేశాడు. అయితే, ప్రియురాలు మృతుడి డెడ్‌బాడీని వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది.
Madhya Pradesh: ప్రస్తుత కాలంలో సాధారణ ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి అంటేనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహాలు చేస్తున్నారు. కానీ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుమారుడు మాత్రం ఈ విషయంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Parliament winter session: శీతాకాలంలో రాజకీయ వేడిని పుట్టించేలా రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ మీట్ నిర్వహించారు. అయితే, ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం నిర్వహిస్తు్న్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చకు డిమాండ్ చేశాయి.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
Siliguri corridor: గతేడాది హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్‌కు తాత్కాలిక పాలకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అప్పటి నుంచి బంగ్లా ప్రభుత్వం భారత వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూనే ఉంది.
Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.
Lizards: బల్లులు ఏ మాత్రం హానికరం కావు, హాని తలపెట్టవు. కానీ వాటిని చూస్తే చాలా మంది భయపడుతుంటారు. నిజానికి ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు వాడినా కూడా ఎక్కడో చోట బల్లులు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. వీటిని ఇంటి నుంచి పారద్రోలడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాం.
BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD)లో ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో రెండుసార్లు ఎమ్మెల్యే, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజేష్ గుప్తా బీజేపీలో చేరారు. దీంతో,ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలీదా జియా(80) ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆమె సన్నిహిత సహాయకుడు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. Read Also: Indus Valley […]
Indus Valley Civilisation: ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది.