BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, భారత వ్యతిరేకులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. 2024లో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనను ప్రస్తావిస్తూ.. యూఎస్ చట్టసభ సభ్యురాలు జానిస్ షాకోవ్స్కీతో ఆయన ఉన్న ఫోటోను ప్రస్తావించింది. ఈ వారం షాకోవ్క్సీ 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్‌కు అనుకూలంగా ఒక లేఖపై సంతకం చేశారు. ఉమర్ ఖలీద్‌ను విడుదల చేయాలని కోరుతూ, మరో ఏడుగురితో కలిసి ఆమె సంతకం చేశారు.
Iran Protest: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని సిటీల్లో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’ అంటూ ఖమేనీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు.
S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, "మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు" అని మంత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి అన్నారు.
Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
OTR: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజక వర్గంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. భర్త వైసీపీలో, భార్య టీడీపీలో ఉండి ట్రెండింగ్ పాలిటిక్స్‌కు తెర తీశారు. ఎన్నాళ్లిలా అనుకుంటూ... ఇద్దరూ ఒకే పార్టీ... అదీ అధికార పార్టీలో ఉందామనుకుంటే అక్కడ నో ఎంట్రీ బోర్డ్ చూపిస్తున్నారట. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతుల డిఫరెంట్ స్టోరీ ఇది.
OTR: ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభరెడ్డి. అన్న అడుగేస్తే మాస్ అన్నట్టుగా... ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా పొలిటికల్ సంచలనం అవుతూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ని గత ఎన్నికల్లో పిఠాపురంలో ఓడిస్తానని శపథం చేసి మరీ షాక్ తిన్నారాయన. చివరికి మరో ఛాయిస్ లేకుండా అన్న మాట ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
Supermoon 2026: కొత్త ఏడాది 2026 మొదలైన మూడు రోజులకే అంతరిక్షంలో తొలి అద్భుతం కనిపించబోతోంది. జనవరి 3న ‘‘వోల్ఫ్ మూన్’’గా పిలిచే ‘‘సూపర్ మూన్’’ దర్శనమివ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడు సాధారణం కన్నా చాలా ప్రకాశవంతంగా, పెద్దగా కనువిందు చేయనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. Read Also: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్‌కు ప్రధాన కారణాలు ఇవే! చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో […]
Space events in 2026: కొత్త ఏడాది 2026కు ప్రపంచం మొత్తం ఘనంగా స్వాగతం పలికింది. అయితే, ఈ ఏడాది ఆకాశంలో 5 అంతరిక్ష అద్భుతాలు చోటు చేసుకోనున్నాయి. అరుదుగా వచ్చే ఈ అంతరిక్ష సంఘటనలను తప్పకచూడాలి. ఈ ఏడాది ప్రారంభంలోనే మిరుమిట్లు గొలిపే ఉత్కాపాతం దర్శనమిస్తుంది. రాత్రిళ్లు కనువిందు చేయనుంది. ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు సూపర్ మూన్‌లు ఏర్పడనున్నాయి.
Saudi Arabia: ఇస్లామిక్ దేశాల్లో ఉరిశిక్షలు సర్వసాధారణం. సౌదీ అరేబియాలాంటి దేశాల్లో వందలాది ఉరిశిక్షలు అమలవుతుంటాయి. 2025లో సౌదీ రికార్డు స్థాయిలో 356 మందికి ఉరిశిక్షల్ని అమలు చేసింది. ఒకే ఏడాదిలో మరణశిక్షలకు గురైన ఖైదీల విషయంలో సౌదీ రికార్డ్ సృష్టించింది. ఉరిశిక్షల పెరుగుదలకు ప్రధాన కారణం ‘‘మాదకద్రవ్యాలపై యుద్ధం’’ అని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. మొదటిసారిగా అరెస్టయిని వారిలో కూడా చాలా మంది ఇప్పుడు ఉరిశిక్షలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, […]
Congress: మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోలే, తన అగ్రనేత రాహుల్ గాంధీని ‘‘శ్రీరాముడి’’తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ‘‘అతి భజన ప్రో మ్యాక్స్’’గా అభివర్ణించింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించకపోవడంపై అడిగిన ప్రశ్నకు నానా పటోలే సమాధానం ఇస్తూ.. ‘‘శ్రీరాముడు చేసిన పనినే రాహుల్ గాంధీ చేస్తున్నాడు’’ అని అన్నారు.