US-Venezuela war: అమెరికా, వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శనివారం తెల్లవారుజామున వెనిజులా వ్యాప్తంగా అమెరికా భారీ దాడులు నిర్వహించింది. రాజధాని కారకస్‌లో యూఎస్ దాడులకు పాల్పడింది. దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదే కాకుండా, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకున్నామని, వారిని దేశం నుంచి తరలించినట్లు ట్రంప్ చెప్పడం సంచలనంగా మారింది. ఈ దాడుల్ని క్యూబా, ఇరాన్ వంటి దేశాలు ఖండించాయి. లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా ఇతర దేశాలు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి.
Read Also: US Venezuela Conflict: వెనిజులాపై బాంబులతో విరుచుకుపడిన అమెరికా..
ఇదిలా ఉంటే, తమ దేశంపై దాడిని వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడు మదురో కార్యాలయం వెనిజులాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇదిలా ఉంటే, ఈ దాడుల గురించి ఫ్లోరిడాలోని తమ మార్ ఏ లాగో నివాసంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తానని ట్రంప్ ప్రకటించారు.
అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు అతని భార్య సిలియా ఫ్లోర్స్ ఎక్కడ ఉన్నారో తెలియదని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ అన్నారు. “అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు, మేము వారు బతికి ఉన్నారా? అనే రుజువు కోరుతున్నాము” అని ఉపాధ్యక్షుడు రోడ్రిగ్జ్ అక్కడి మీడియాతో అన్నారు.