iPhone: తన గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఏకంగా ఓ బాలుడు అమ్మ నగలనే దొంగిలించాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థి తనతో గర్ల్ ఫ్రెండ్‌కి పుట్టిన రోజున ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బంగారాన్ని చోరీ చేశాడు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. ఈ ఆరోపణలపై బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
English Teacher: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
CM Yogi Adityanath: బంగ్లాదేశ్‌లో హిందువులను సెలెక్టివ్‌గా టార్గెట్ చేస్తున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం ఆరోపించారు. సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన బుధవారం అన్నారు.
Ayodhya Gangrape Case: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో అయోధ్య గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుడైన మోయిద్ ఖాన్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కీలక నేతగా ఉన్నారు. ఇతను భద్రస నగర ఎస్పీ అధ్యక్షుడు. ఇతడితో పాటు ఇతనికి సంబంధించిన ఖాన్ బేకరీలో పనిచేసే రాజు ఖాన్ మరో నిందితుడు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ హింసాత్మక ఘటనల మధ్య తొలిసారిగా షేక్ హసీనా ప్రత్యర్థి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్, మాజీ ప్రధాని ఖలిదా జియా తొలి సందేశాన్ని ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోయిన తర్వాత, ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ జైలులో ఉన్న ఖలిదా జియాను విడుదల చేయాలని ఆదేశించారు.
Waqf board Bill: వక్ఫ్ బోర్డు ‘‘అపరిమిత అధికారాలకు’’ చెక్ పెట్టెందుకు మిగతా ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం వహించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతోంది. రేపు(గురువారం) లోక్‌సభ ముందు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెడతారు.
Barber: తినే ఆహరంలో, కూల్‌డ్రింక్స్‌లో కొందరు పైశాచిక ఆనందం కోసం ఉమ్మేయడం చూశాం. ఇప్పుడు ఓ బార్బర్ తన కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తున్న సమయంలో ఉమ్మిని ఉపయోగించిన వీడియో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ కనౌజ్‌కి చెందిన ఓ సెలూన్లో బార్బర్ కస్టమర్ ముఖానికి ఉమ్మిని రాసిన వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
Vinesh Phogat: ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తుందని యావత్ దేశం వినేష్ ఫోగట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంగా ఒలింపిక్స్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం ఒక్కసారిగా దేశం షాక్‌కి గురైంది.
ఇదిలా ఉంటే, ఒక్క హిందువులనే కాకుండా షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసానికి తెగబడుతున్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు, నేతల ఇళ్లను చుట్టుముట్టి నిప్పుపెడుతున్నారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకి పారిపోయివచ్చినప్పటికీ అక్కడ పరిస్థితి చక్కబడటం లేదు. ముఖ్యంగా హసీనాకు చెందిన అవామీ లీడ్ పార్టీ నేతలతో పాటు హిందువులను టార్గెట్ చేస్తున్నారు.